టైగర్ గర్ల్ గా మారిన జాక్వెలిన్..కొత్త లుక్స్ అదుర్స్!
ప్రస్తుత కాలంలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ సెలబ్రిటీలు గ్లామర్ ఫోటోషూట్స్ తోనే కాదు భిన్నమైన ఫొటోస్ షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు
By: Madhu Reddy | 21 Aug 2025 9:37 PM ISTప్రస్తుత కాలంలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ సెలబ్రిటీలు గ్లామర్ ఫోటోషూట్స్ తోనే కాదు భిన్నమైన ఫొటోస్ షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కనీ విని ఎరుగని రీతిలో అద్భుతమైన డిజైన్లలో దుస్తులను తయారు చేయించి మరీ ధరిస్తూ ఉండడంతో వీరి ఫ్యాషన్స్ కి అభిమానులు ముగ్ధులు అవుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా తన అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఫాలోవర్స్ చేత "టైగర్ గర్ల్" అనే బిరుదుని కూడా పొందింది. ఆమె ఎవరో కాదు జాక్వెలిన్ ఫెర్నాండేజ్.
ఈమధ్య కాలంలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా టైగర్ ప్రింట్ స్ట్రాపీ గౌనులో కనిపించింది. ఇది ఆమెకు స్టైలిష్ లుక్ ను అందించింది. ముఖ్యంగా ఈ దుస్తులు ఆమె అందాన్ని పెంచడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పవచ్చు. ఇక ఈ డ్రెస్ చూసిన అభిమానులు ఈమెను టైగర్ గర్ల్ అంటూ పిలుస్తున్నారు. మొత్తానికి అయితే దుస్తులపై టైగర్ ప్రింట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ ముద్దుగుమ్మ ఈ దుస్తులతో సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకుంటుంది అని చెప్పవచ్చు.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ విషయానికి వస్తే.. మోడల్ గా, సినీనటిగా మంచి పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె శ్రీలంకకు చెందినవారు. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైన ఈమె.. శ్రీలంక తరఫున 2006లో మిస్ యూనివర్స్ పోటీకి వెళ్లి అక్కడ కిరీటాన్ని కైవసం చేసుకుంది. సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. కొంతకాలం శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా పనిచేసింది.
2009లో భారతదేశంలో అలాడిన్ అనే సినిమా ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాతోనే నటిగా తన కెరీర్ ను ఆరంభించింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈ సినిమా పెద్దగా గుర్తింపును అందివ్వలేదు కానీ 2011లో వచ్చిన మర్డర్ 2 సినిమాతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది.ఈ సినిమా విజయవంతం కావడంతో ఈమెకు వరుసగా గ్లామర్ పాత్రలు తలుపు తట్టాయి.
అలా 2012లో హౌస్ ఫుల్ 2, 2013లో రేస్ 2 పంటి చిత్రాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇకపోతే హౌస్ ఫుల్ 2 సినిమాలో నటనకు గానూ ఈమెకు ఐఫా పురస్కారాలలో ఉత్తమ సహాయ నటి కేటగిరీలో నామినేషన్ లభించడం గమనార్హం. ప్రధాన కథానాయిక పాత్రలో కిక్ అనే హిందీ సినిమా ద్వారా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యంత ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా ఇది నిలిచింది.
ఈ సినిమా తర్వాత హౌస్ ఫుల్ 3, ఎ ఫ్లయింగ్ జెట్ సినిమాలు వరుసగా విజయం సాధించాయి. ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ తో కూడా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
