తెలుగు సినిమాలో జాక్వెలిన్, ట్విస్ట్ ఏంటంటే..!
శ్రీలంక బ్యూటీ అయినప్పటికీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి ఇండియాలో మంచి ఫాలోయింగ్ దక్కింది. దశాబ్ద కాలంగా బాలీవుడ్‌లో తెగ సందడి చేస్తూనే ఉంది.
By: Ramesh Palla | 5 Aug 2025 5:00 PM ISTశ్రీలంక బ్యూటీ అయినప్పటికీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి ఇండియాలో మంచి ఫాలోయింగ్ దక్కింది. దశాబ్ద కాలంగా బాలీవుడ్‌లో తెగ సందడి చేస్తూనే ఉంది. రియాల్టీ షో లు, స్టేజ్ షోలు, సినిమాలు ఇలా చెప్పుకుంటూ పోతే జాక్వెలిన్ ఇండియన్ ప్రేక్షకుల కోసం చాలానే చేసింది. సిడ్నీ విశ్వ విద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో పట్టా తీసుకున్న జాక్వెలిన్ శ్రీలంకలో మొదట టెలివిజన్ రిపోర్టర్‌గా పని చేసింది. ఆ తర్వాత మోడల్‌గా మారి, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా ఆమె కెరీర్ మొత్తం మారింది. 2006లో మిస్ యూనివర్స్ కి గాను లంక నుంచి ప్రాతినధ్యం వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్
2009లో ఇండియాలో మోడల్‌గా జాక్వెలిన్ కెరీర్‌ను ఆరంభించింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా భారీ విజయాలను దక్కించుకుంది. 2011లో మర్డర్ 2 లో మంచి పాత్రను చేయడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. హౌస్‌ఫుల్ 2 సినిమాతో 2012లో సూపర్ హిట్‌ను దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్‌గా పెద్ద హీరోయిన్ అనే పేరును సొంతం చేసుకుంది. రేస్ 2 లో గ్లామర్ డాల్‌గా, కిక్ లో మంచి నటిగానూ మెప్పించింది. బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లోనూ ఈమె నటిగా మెప్పించింది. విక్రాంత్ రోనా సినిమాతో కన్నడ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించింది. జాక్వెలిన్ ఐటెం సాంగ్స్‌కి పెట్టింది పేరు అనే విషయం తెల్సిందే. ఆ మధ్య పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ముఖ్య పాత్రను జాక్వెలిన్ తో చేయించేందుకు చర్చలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి.
వి జయశంకర్ దర్శకత్వంలో జాక్వెలిన్
కొన్ని కారణాల వల్ల పవన్ మూవీ వీరమల్లులో నటించే అవకాశం దక్కలేదు. బాలీవుడ్‌లో ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాక్వెలిన్ చేతిలో మరో రెండు మూడు సినిమాలు సైతం ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎట్టకేలకు తెలుగు సినిమాకు ఓకే చెప్పింది. తెలుగు దర్శకుడు వి జయశంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక సస్పెన్స్ ఇంటెన్స్ స్క్రిప్ట్ కి జాక్వెలిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. పేపర్ బాయ్, ఆరితో పాటు ఇంకా పలు సినిమాలకు వర్క్ చేసి దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న జయ శంకర్ ప్రతి సారి విభిన్నమైన కథాంశంతో, స్క్రీన్ ప్లేతో సినిమాలను రూపొందించడం మనం చూస్తూ ఉంటాం.
సాహో సినిమా తర్వాత మరో తెలుగు సినిమా
జయశంకర్ కొత్తగా తీయబోతున్న సినిమా కోసం హీరోయిన్‌గా జాక్వెలిన్ ను దాదాపుగా కన్ఫర్మ్ చేశారంటూ టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. సాధారణంగా జాక్వెలిన్ వంటి బాలీవుడ్ స్టార్‌ను ఒప్పించడం అంత సులభమైన విషయం కాదు. ఆమెకు భారీ పారితోషికం ఉంటుంది, అంతే కాకుండా స్క్రిప్ట్ సైతం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మరి జాక్వెలిన్‌ను దర్శకుడు ఒప్పించాడు అంటే ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్ ఉంటుంది. ఈ సినిమాను జాక్వెలిన్‌కు ఉన్న క్రేజ్‌తో తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డబ్ చేసి పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాలేదు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో ఒప్పందాలు జరగలేదని, ఆమెతో ఒప్పందం జరిగిన తర్వాత అధికారికంగా సినిమా గురించి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జాక్వెలిన్ గతంలో ప్రభాస్ సాహో సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. తెలుగులో మరోసారి కనిపించబోతుంది. కానీ ట్విస్ట్ ఏంటేంటే పెద్దగా క్రేజ్ లేని సినిమాలో నటించబోతుంది. పెద్ద స్టార్ హీరో సినిమా కాదు, పెద్ద బ్యానర్ కాదు, అయినా కథ పై నమ్మకంతో జాక్వెలిన్ తెలుగు సినిమాకు రెడీ అయింది. మరి జాక్వెలిన్ నమ్మకం నిలిచేనా చూడాలి.
