Begin typing your search above and press return to search.

చిన్నారికి అండగా జాక్వెలిన్.. అసలేం జరిగిందంటే?

అరుదైన వ్యాధితో బాధపడుతున్న మొహమ్మద్ అనే చిన్నారికి ఆర్థికంగా అండగా నిలుస్తూ.. చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు జాక్వెలిన్.

By:  Madhu Reddy   |   11 Sept 2025 2:00 AM IST
చిన్నారికి అండగా జాక్వెలిన్.. అసలేం జరిగిందంటే?
X

జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. నటిగానే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తిగా కూడా తనను తాను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ప్రకటిస్తూ.. మంచి మనసును చాటుకుంటున్న ఈమె.. అటు మూగ జీవాలకు అండగా.. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ముందడుగు వేస్తోంది. అలాంటి ఈమె ఇప్పుడు చేసిన మరో గొప్ప పని చూసి ప్రతి ఒక్కరు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి గొప్ప వారికి ఎప్పుడూ కూడా మంచే జరగాలి అంటూ కోరుకుంటూ ఉండడం గమనార్హం.


అరుదైన వ్యాధితో బాధపడుతున్న మొహమ్మద్ అనే చిన్నారికి ఆర్థికంగా అండగా నిలుస్తూ.. చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు జాక్వెలిన్. అసలు విషయంలోకెళితే ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి ఈ విషయాన్ని ఆమెకు చేరవేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జాక్వెలిన్ నేరుగా ఆ బాలుడు ఇంటికి వెళ్లి ఆ బాలుడితో కబుర్లు చెప్పి.. నవ్వించే ప్రయత్నం చేసింది.. అందుకు సంబంధించిన వీడియోని ఇప్పుడు హుస్సేన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అందులో ఆమె ఆ బాబుతో ఆడుతూ కబుర్లు చెప్పడం మనం చూడవచ్చు. అంతేకాదు అక్కడ కనిపిస్తున్న బాబు తల బెలూన్ లా ఉబ్బిపోయి ఉంది. తలపై నరాలు కూడా కనిపిస్తున్నాయి.

అయితే ఇలా శరీరమంతా మామూలు స్థితిలో ఉండి, తల మాత్రమే పెద్ద పరిమాణంలో ఉండడాన్ని 'హైడ్రో సెఫాలస్' అని పిలుస్తారు. ఈ వ్యాధి వచ్చిన శిశువుల తల సాధారణం కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న జాక్వెలిన్ చలించిపోయింది. వెంటనే బాలుడి కుటుంబాన్ని కలిసి సర్జరీ చేయిస్తానని హామీ కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని హుస్సేన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి వస్తాడని ఆశిద్దాం అంటూ ఆయన పోస్ట్ కూడా పెట్టారు. ప్రస్తుతం జాక్వెలిన్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్స్ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

జాక్వెలిన్ కెరీర్ విషయానికి వస్తే.. 1985 ఆగస్టు 11న మనమా, బహ్రయిన్ లో జన్మించింది. మోడల్ గా కెరియర్ ను ఆరంభించి, నటిగా అడుగులు వేసింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైన ఈమె.. శ్రీలంక తరఫున 2006లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లి అక్కడ టైటిల్ గెలుచుకుంది. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా పనిచేసిన ఈమె.. ఈ రంగంలోకి అడుగు పెట్టకముందే సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్లు డిగ్రీ కూడా పూర్తి చేసింది. మోడల్ గా చేస్తున్నప్పుడే సినిమాలలో నటించాలనుకున్న జాక్వెలిన్.. అందులో భాగంగానే ఇండియాలో 2009లో తెరకెక్కిన అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్స్ జరగగా అక్కడ హాజరయ్యింది. ఇదే సినిమా ఈమెకు మొదటి ప్రాజెక్ట్ కావడం గమనార్హం ఇక మర్డర్ 2 తో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె రేస్ 2, హౌస్ ఫుల్ 2 పంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న వెల్కమ్ టు ది జంగిల్ అనే సినిమాలో నటిస్తోంది.