Begin typing your search above and press return to search.

పారిస్ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన జాక్వెలిన్.. అందాలతో రెచ్చగొడుతూ!

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తాజాగా పలు దేశాలలో నిర్వహించే ఫ్యాషన్ వీక్ లలో పాల్గొంటూ తన అంద చందాలతో అక్కడివారిని అట్రాక్ట్ చేస్తోంది.

By:  Madhu Reddy   |   4 Oct 2025 4:13 PM IST
పారిస్ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన జాక్వెలిన్.. అందాలతో రెచ్చగొడుతూ!
X

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తాజాగా పలు దేశాలలో నిర్వహించే ఫ్యాషన్ వీక్ లలో పాల్గొంటూ తన అంద చందాలతో అక్కడివారిని అట్రాక్ట్ చేస్తోంది. ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలు ప్రపంచవ్యాప్తంగా ఉండే డిజైనర్లకు మాత్రమే కాకుండా రన్ వే లేదా రెడ్ కార్పెట్ పై నడిచే సెలబ్రిటీలకు ప్రత్యేక ఉనికిని తీసుకువచ్చి పెడతాయి. అలా తాజాగా లండన్ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పారిస్ ఫ్యాషన్ వీక్ లో కూడా మెరిసింది.

అయితే ఈ పారిస్ ఫ్యాషన్ వీక్ లో తన అందంతో అక్కడున్న వారిని ఆకట్టుకుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. నల్లటి పొడవాటి గౌనుని ధరించిన జాక్వెలిన్ డీప్ వీ నెక్ లైన్ తో తన ఎద అందాలను హైలెట్ చేస్తూ.. చూసే ఆడియన్స్ కి నిద్రలేకుండా చేసింది. అలాగే నడుము వద్ద మెరిసే రత్నపు క్లాస్ప్ తో ఉన్న ఫ్యాబ్రిక్ ఆమె అందానికి మరింత హైలెట్ గా నిలిచింది. ఈ బ్లాక్ కలర్ పొడవాటి డ్రెస్ కి అనుగుణంగా ఉండే హెయిర్ స్టైల్ ని ఎంచుకుంది. హెవీ హెయిర్ స్టైల్ కాకుండా పోనీటేల్ వేసుకొని చెవులకు చెవి పోగులు పెట్టుకోవడంతోపాటు చేతి వేళ్లకు ఉంగరాలు కూడా పెట్టుకొని లుక్ ని హైలెట్ చేసింది..

ఇకపోతే ఇలాంటి అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ ల కారణంగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తోంది. తన లుక్ తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు భారతీయ సినిమా, కళాత్మకతకు ప్రతినిధిగా నిలుస్తోంది.. ఓ పక్క అంతర్జాతీయ ఫ్యాషన్ వీకుల్లో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుంటూనే మరో పక్క పలు సినిమాలు కూడా చేస్తూ హీరోయిన్ గా రాణిస్తోంది.

ఈమె రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాల్లో కనిపించింది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రంలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వివాదాల విషయానికి వస్తే..ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ దగ్గర విలువైన బహుమతులు అందుకొని మనీలాండరింగ్ కేసులో కూడా ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ కేసును కొట్టివేయాలి అని ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈమెకు అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది ముఖ్యంగా సుఖేష్ చంద్ర 250 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈమె హస్తం ఉందని.. ముఖ్యంగా సుకేశ్ చంద్ర జైల్లో ఉన్నప్పటికీ ఈమెకు కోట్ల రూపాయల విలువ చేసే బహుమతులు అందించారని.. సాక్షాలతో సహా అధికారులు సుప్రీంకోర్టుకు సమర్పించడంతో ఈమె పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. మరి ఈ కేసు నుంచి జాక్వెలిన్ అసలు బయట పడుతుందా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.