దుబాయ్ టూర్‌లో జాక్విలిన్ దుమ్ము దుమారం
నిజానికి దబాంగ్ టూర్‌తో జాక్వెలిన్ అనుబంధం ఈనాటిది కాదు. ఎనిమిదేళ్లుగా దబాంగ్ టీర్ కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది.
By: Sivaji Kontham | 17 Nov 2025 10:35 AM ISTసినిమాలు ఫ్లాపులైనా, దబాంగ్ టూర్ తో తనను తాను లైమ్ లైట్ లో ఉంచుకుంటున్నాడు సల్మాన్ భాయ్. అతడు తన చుట్టూ లైవ్ వైర్ లాంటి అందాల కథానాయికలను చేర్చుకుని, టూర్ ని రక్తి కట్టిస్తున్నాడు. దేశవిదేశాలలో దబాంగ్ టూర్ పేరుతో అతడు ఇస్తున్న హై వోల్టేజ్ పెర్ఫామెన్సెస్ కి స్పందన అసాధారణంగా ఉంది.
ఎప్పటిలాగే ఈసారి కూడా దుబాయ్ లో దబాంగ్ టూర్ ని పెద్ద సక్సెస్ చేసేందుకు అందాల కథానాయికల్ని బరిలో దించిన సల్మాన్ భాయ్ అక్కడ తనదైన శైలిలో మ్యాజిక్ చేస్తున్నాడు. ఈసారి కూడా శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ దబాంగ్ టూర్ కి ప్రధాన ఆకర్షణగా మారింది.
నిజానికి దబాంగ్ టూర్‌తో జాక్వెలిన్ అనుబంధం ఈనాటిది కాదు. ఎనిమిదేళ్లుగా దబాంగ్ టీర్ కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది. ఈ ప్రయాణం 2017లో మొదలైంది. ప్రారంభమే బ్రిటన్ లో షోతో అదరగొట్టేసింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి లండన్, బర్మింగ్‌హామ్‌లో దుమారం రేపింది. అటుపైనా దబాంగ్ యూనివర్శ్ లో కీలక పెర్ఫామర్ గా మారింది. అమెరికా, కెనడా, దుబాయ్, భారతదేశం సహా అంతర్జాతీయంగా షోలలో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. 2018లో ఉత్తర అమెరికా అంతటా రీలోడెడ్ షోలతో దుమ్ము దులిపేసింది. 2019లో దుబాయ్‌లో జాక్విలిన్ ప్రదర్శనకు యూత్ గగ్గోలు పెట్టింది.
2022లో దుబాయ్ ఎక్స్‌పో స్పెషల్ ఎడిషన్‌లో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ తర్వాత 2023లో కోల్‌కతాలో దబాంగ్ షోలోను మెరుపులు మెరిపించింది. టూర్ ఆద్యంతం సల్మాన్ భాయ్ తో జాక్విలిన్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుటైంది. ముఖ్యంగా డ్యాన్సుల ప్రాక్టీస్ సహా ప్రతి అంశంలోను జాక్విలిన్ అంకితభావం ప్రధానంగా చర్చగా మారింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు మరోసారి దుబాయ్ లో ప్రత్యక్షమైంది. దబాంగ్ షో కోసం ప్రత్యేకంగా తనను తాను ప్రిపేర్ చేసుకుంది. తాజా ఈవెంట్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బ్లూ కలర్ డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయింది. ఈ దుస్తులకు తగ్గట్టుగానే హీల్స్ ని కూడా బ్లూ అండ్ బ్లూ మెయింటెయిన్ చేసిన ఈ బ్యూటీ స్టేజీపై సల్మాన్ భాయ్ తో డ్యాన్సులు చేస్తూ, ఒంపు సొంపులను రంగరిస్తూ ఆడియెన్ కి అదిరిపోయే ట్రీటిచ్చింది. ప్రస్తుతం దుబాయ్ లోని దబాంగ్ టూర్ నుంచి వరుస ఫోటోలు ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి. ముఖ్యంగా జాక్విలిన్ స్పెషల్ ఫోటోగ్రాఫ్స్ నెట్ ని హీటెక్కిస్తున్నాయి.
