తెరపైకి 256 ఏళ్ల వృద్దుడి బయోపిక్
అప్పటికే లీకి 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వారికి 500 మంది సంతానం గా చెబుతారు. మొత్తంగా 256 ఏళ్ల లో 11 తరాలను చూసిని మనిషియా లీ చింగ్ ని పేర్కొంటారు.
By: Srikanth Kontham | 15 Aug 2025 9:00 PM ISTచైనాకు చెందిన లీ చింగ్ యుయెన్ 256 ఏళ్లు బ్రతికి రికార్డు సృష్టించినట్లు చెప్పుకుంటారు. చైనాలోని సిచుయాన్ ప్రాంతంలో జన్మించిన చింగ్ యుయెన్ 10 ఏళ్ల వయసులో ఆయుర్వేద మూలికలు సేకరణ ప్రారంభించారు. అలా ఆయుర్వేదంతో ఏర్పడిన పరిచయంతో వైద్యుడిగా మారారు. తదానంతరం అనేక ప్రాంతాల్లో తిరిగారు. 72వ ఏట కైక్సియన్ ప్రాంతానికి చేరుకున్నారు. 1749 లో చైనా ఆర్మీల చేరి మార్షల్ ఆర్ట్స్ ను శిక్షణ సైతం అందించినట్లు చెబుతారు. చివరికి 1927 లో సిచుయాన్ కి చేరుకున్నాడు.
అప్పటికే లీకి 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వారికి 500 మంది సంతానం గా చెబుతారు. మొత్తంగా 256 ఏళ్ల లో 11 తరాలను చూసిని మనిషియా లీ చింగ్ ని పేర్కొంటారు. 1933 లో లీ మరణించాడు. అప్పటికే 256 ఏళ్లు. ఇది చరిత్రలో జరిగిన ఘటనగా చెబుతారు. అయితే ఆయన వయసుపై భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. ఆయన జనన..మరణాలపై రకరకాల సందేహాలు వ్యక్తంచేసిన ప్రోపెసర్స్ ఎంతో మంది. అవన్నీ పక్కన బెడితే తాజాగా లీ చింగ్ యుయెన్ జీవిత కథను వెండి తరకెక్కించాలని జాకీ చాన్ సంకల్పించినట్లు ఓవార్త వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించిన పనులన్నీంటిని జాకీచాన్ నిర్మాణ సంస్థ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం జాకీచాన్ కూడా భాగమయ్యారుట. తన రైటింగ్ టీమ్ తో పాటు తాను కథా న్వేషణలో భాగమైనట్లు తెలుస్తోంది. స్టోరీ సిద్దం చేయడానికి రెండేళ్లకు పైగా సమయం తీసుకుంటున్నారుట. లీకి సంబంధించి వచ్చిన కథలన్నింటిని సేకరించుకుని పక్కాగా స్క్రిప్ట్ సిద్దం చేయడానికి అంత సమయం కేటాయిం చినట్లు తెలుస్తోంది. లీ పై వివిధ భాషలు, లిపిలో ఉన్న వాటిని సేకరించి వాటిని తమ భాషలోకి తర్జుమా చేసి కథను సిద్దం చేయాలి.
ఇదంతా ఈజీ ప్రోసస్ కాదు. అందుకే రెండేళ్లు కథపైనే వర్క్ చేస్తున్నారు. దీనిలో భాగంగా జాకీ చాన్ అండ్ కో ప్రపంచంలో ఉన్న వివిధ లైబ్రైరీలను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జాకీచాన్ చాలా పెద్ద బాధ్యతే తీసుకున్నాడు. ఎవరూ చేయని పెద్ద సాహసమే ఇది. మరి ఈ మిషన్ జాకీచాన్ ఎలా కంప్లీట్ చేస్తారో చూడాలి.
