ది ప్యారడైజ్ షూటింగ్ కంప్లీట్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన కొమరం!
ఇటీవల శివా నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రంలో నాగులు అనే పాత్ర పోషించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
By: Madhu Reddy | 28 Aug 2026 5:54 PM ISTజబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న కొమరం.. జబర్దస్త్ కంటే కూడా కొమరక్క అనే లేడీ గెటప్ తో ఊహించని పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చే 18 ఏళ్ళు అవుతున్నప్పటికీ.. 12 ఏళ్లుగా కొమరక్క అనే లేడీ గెటప్ తో చలామణి అవుతున్న కొమరం.. ఇటీవల శివా నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రంలో నాగులు అనే పాత్ర పోషించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఇన్నేళ్ల కెరియర్లో తనతో కలిసి రూమ్ షేర్ చేసుకున్న ఎంతోమంది నటులు, ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో దర్శకులుగా దూసుకుపోతుంటే.. ఎవరూ కూడా తనకు అవకాశం ఇవ్వలేదని, కానీ తాను ఎవరో కూడా తెలియని డైరెక్టర్ శివా నిర్వాణ పిలిచి మరీ నాగులు అనే ఒక గొప్ప క్యారెక్టర్ ఇవ్వడం పై ఎమోషనల్ అయ్యారు కొమరం. తాను, తన కుటుంబం జీవితాంతం శివా నిర్వాణకు రుణపడి ఉంటామంటూ ఇటీవల ఇరుముడి బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ఈవెంట్లో కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే.
అలా నాగులు పాత్రతో మంచి పేరు సంపాదించుకున్న కొమరం.. ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంలో కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలపై ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొమరం స్వయంగా స్పందించారు. ఇంటర్వ్యూలో భాగంగా ది ప్యారడైజ్ చిత్రంలో మీది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కదా? అనే ప్రశ్నించగా.. కొమరం మాట్లాడుతూ.. "మీరు అనుకుంటున్నట్లు నాకు ప్యారడైజ్ చిత్రంలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఇరుముడి ఒప్పుకోకముందు ది ప్యారడైజ్ చిత్రం అగ్రిమెంటులో నేను సైన్ చేసేటప్పుడు.. నా పాత్ర ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్.
అయితే షూటింగ్ మొదలుపెట్టే సమయానికి ఆ క్యారెక్టర్ కథ నుండి డిలీట్ అయింది. ఇక అదే సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. అన్నా ఆ క్యారెక్టర్ రాసే క్రమంలో, తీసే క్రమంలో ఎగిరిపోయింది.. నిన్ను అక్కడ పెట్టాలంటే నా మనసు ఒప్పట్లేదు. వేరే క్యారెక్టర్ పెడదాం అన్నారు.
ఇక ఆ క్యారెక్టర్ పెడదామనుకునే లోపే చాలా గ్యాప్ లు వచ్చాయి. ఆ గ్యాప్ లో ఇరుముడి సినిమా అయిపోయింది. మళ్లీ నేను శ్రీకాంత్ కి ఫోన్ చేస్తే.. డాక్టర్ క్యారెక్టర్ అన్నారు. ఆ క్యారెక్టర్ కి చేస్తుంటే డైలాగులు తక్కువ ఉన్నాయి. ఇది కూడా వద్దన్నా అని చెప్పారు. నిన్ను పెడితే ఒక మంచి పాత్రలోనే పెడదామనుకున్నాను. అన్నాడు. నేను సైలెంట్ అయిపోయా..
ఆ తర్వాత క్లైమాక్స్లో ఒక మంచి ఆఫీసర్ పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర షూటింగ్ కూడా అయిపోయింది. కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. సినిమా మొత్తం అయిపోయింది. సినిమా చాలా బాగా వచ్చింది. నేనేం కోరుకుంటున్నానంటే ఇరుముడి సినిమా ఎంత సక్సెస్ అయిందో.. ప్యారడైజ్ కూడా అంతే సక్సెస్ అవ్వాలి.. ఆయన చాలా మంచివారు. దేవుడి దయతో టాలీవుడ్ లో సినిమాలన్నీ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఆ జాబితాలో ది ప్యారడైజ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ కొమరం తెలిపారు. మొత్తానికైతే ది ప్యారడైజ్ చిత్రంలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అంటూ వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు
