యాడ్స్‌తో మహేష్ మేనకోడలు.. స్టన్నింగ్ సర్ ప్రైజ్
లేటెస్ట్ గా, ఈ స్టార్ కిడ్ ఒక ఫేమస్ జ్యువెలరీ బ్రాండ్ "కౌశిక్ గోల్డ్ అండ్ డైమండ్స్"కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది.
By: M Prashanth | 8 Nov 2025 10:53 AM ISTఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో స్టార్ కిడ్ లాంచ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు, మంజుల కూతురు జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని రీసెంట్‌గా అఫీషియల్ న్యూస్ వచ్చేసింది. ఈ న్యూస్‌తో ఘట్టమనేని ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
అయితే, తన ఫస్ట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లకముందే, జాన్వీ కెమెరా ముందు తన టాలెంట్ చూపించేయడం విశేషం. లేటెస్ట్ గా, ఈ స్టార్ కిడ్ ఒక ఫేమస్ జ్యువెలరీ బ్రాండ్ "కౌశిక్ గోల్డ్ అండ్ డైమండ్స్"కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. దీనికి సంబంధించిన యాడ్స్, ఫోటోషూట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ యాడ్స్ చూస్తే.. ఇవి నార్మల్ కమర్షియల్స్‌లా లేవు. ఒక భారీ బడ్జెట్ సినిమా టీజర్‌ను తలపించేలా, చాలా రిచ్‌గా, రాయల్‌గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా జాన్వీ లుక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఒక యాడ్‌లో రాయల్ లెహంగాలో, డైమండ్ జ్యువెలరీలో.. మరో యాడ్‌లో పక్కా ట్రెడిషనల్ పట్టుచీర, టెంపుల్ గోల్డ్ జ్యువెలరీలో.. ఇలా రెండు వేరియేషన్స్‌లో జాన్వీ చాలా గ్రేస్‌ఫుల్‌గా, హీరోయిన్ మెటీరియల్‌లా కనిపిస్తున్నారు.
అంతేకాదు, ఒక వెడ్డింగ్ కాన్సెప్ట్ యాడ్‌లో జాన్వీతో పాటు తన తల్లి మంజుల కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో హైలైట్. కూతురిని పెళ్లికూతురిగా రెడీ చేస్తున్న తల్లిగా మంజుల కనిపించారు. ఈ తల్లీకూతుళ్ల కాంబో యాడ్‌కు స్పెషల్ అట్రాక్షన్ తెచ్చింది. వాళ్ల మధ్య కెమిస్ట్రీ చాలా నాచురల్‌గా వర్కవుట్ అయింది.
నిజానికి జాన్వీకి కెమెరా కొత్తేమీ కాదు. గతంలో 'మనసుకు నచ్చింది' సినిమాలో చిన్న రోల్ చేసింది. కానీ, ఇలా ఒక బ్రాండ్‌కు ఫేస్‌గా మారి, ఫుల్ గ్లామర్‌తో, ప్రొఫెషనల్ యాక్టర్‌లా కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. తన డెబ్యూ మూవీకి ముందే.. ఈ యాడ్స్ ద్వారా కెమెరా ముందు ఎలా మెప్పించాలో ఫుల్ ప్రాక్టీస్ చేసేస్తోందన్నమాట. లుక్స్ పరంగా, కాన్ఫిడెన్స్ పరంగా జాన్వీ 100% రెడీ అని ఈ యాడ్స్ క్లారిటీ ఇచ్చేశాయి.
రీసెంట్‌గా మంజుల చెప్పినట్టే.. జాన్వీ డెబ్యూ మూవీకి సంబంధించిన డైరెక్టర్, ప్రొడక్షన్ బ్యానర్ అన్నీ లాక్ అయ్యాయట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ యాడ్స్‌తోనే ఇంత రచ్చ చేసిన జాన్వీ, ఇక సిల్వర్ స్క్రీన్ మీద ఎలా మెరుస్తుందో చూడాలని మహేష్ బాబు ఫ్యాన్స్, ఘట్టమనేని ఫ్యామిలీ ఫాలోవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
