సింపుల్ లుక్ లో మనసు దోచుకుంటున్న ఇవానా!
తాజాగా పర్పుల్ కలర్ మినీ డ్రెస్ ధరించిన ఈమె తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సింపుల్ స్మైల్ ఇస్తూ.. కుర్రకారు హృదయాలను దోచుకుంది.
By: Madhu Reddy | 26 Dec 2025 12:14 AM ISTఈరోజు క్రిస్మస్ కావడంతో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా తమ ఇంట్లో స్పెషల్ గా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటే.. మరికొంతమంది స్నేహితులతో.. ఇంకొంతమంది ఒంటరిగా ఈ వేడుకలను జరుపుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ప్రముఖ బ్యూటీ ఇవానా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకుంది.
క్రిస్మస్ ట్రీ దగ్గర స్టైలిష్ గా నిల్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది. తాజాగా పర్పుల్ కలర్ మినీ డ్రెస్ ధరించిన ఈమె తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సింపుల్ స్మైల్ ఇస్తూ.. కుర్రకారు హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం ఇవానా షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మేరీ క్రిస్మస్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఇవానాకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈమె అసలు పేరు అలీనా షాజీ. 2000 ఫిబ్రవరి 25న జన్మించిన ఈమె ఇవానాగా తన పేరును మార్చుకుంది. ఎక్కువగా మలయాళం, తమిళ్ భాష చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇవానా.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన లవ్ టుడే సినిమాతో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని 2022 నవంబర్ 25న తెలుగులో కూడా విడుదల చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే 2018 లోనే తమిళ డబ్బింగ్ చిత్రం ఝాన్సీతో తెలుగులో అడుగుపెట్టింది. కానీ పెద్దగా ప్రేక్షకులకు తెలియదు. కానీ లవ్ టుడే సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ఇవానా.
ఎల్జీఎం అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించిన సింగిల్ అనే సినిమాతో నేరుగా తెలుగు చిత్రం చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఈమె గీత ఆర్ట్స్ వంటి పేరు పొందిన సంస్థ ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం సంతోషంగా ఉందని తెలిపింది. అలాగే తెలుగు లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూ.. తెలుగు చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడానికి నేను ప్రయత్నించాను. శ్రీ విష్ణు కూడా చాలా సహాయం చేశారు అంటూ తెలిపింది.
రియల్ లైఫ్ కి రిలేటివ్ గా ఉండే పాత్రలు చేయాలనేదే తన లక్ష్యమని.. ప్రస్తుతం పీజీ చేస్తున్నానని చెప్పిన ఈమె.. ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తున్నానని తెలిపింది. అలాగే తెలుగు, తమిళ్ భాషలలో తనకు వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది ఇవానా.
