ఇట్లు అర్జున: మాటలు వినిపించవ్.. ప్రేమ మాత్రం స్ట్రాంగ్ గానే
టీజర్ లాంచ్ ఈవెంట్ లో అనీష్ తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అర్జున్ రోల్ తనకు చాలా ప్రత్యేకమని అన్నారు.
By: M Prashanth | 20 Sept 2026 12:56 PM ISTసినిమాలో హీరో డైలాగ్ చెబితే ఆ మాటలు గుర్తుండిపోతాయి. కానీ ఇట్లు అర్జునలో మాత్రం హీరో మాటలు వినిపించవు. అయినా అతడి ప్రేమ మాత్రం చాలా గట్టిగా కనిపిస్తుంది. మాటలు లేకుండా ఓ ప్రేమకథను చెప్పడం.. దానికి యాక్షన్, ఎమోషన్ ను యాడ్ చేయడం ఆ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆ విషయాన్నే చూపించింది.
అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం ఇట్లు అర్జున. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించిన ఆ సినిమాను వెంకీ కుడుముల నిర్మించారు. అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం విడుదలైన టీజర్ లో అర్జున్ రోల్ ను పరిచయం చేశారు. అర్జున్ కు మాటలు రావు. కానీ తన మనసులో ఉన్న ప్రేమను మాత్రం తన చేతలతో చూపిస్తాడు. దీంతో ఆ రోల్ ఎలా ఉంటుంది? ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడు? అనే ఆసక్తి కలుగుతోంది.
టీజర్ లో ఈ నగరానికి కొత్త పోరడొచ్చినాడే.. అంటూ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ గా నిలిచింది. లవ్ స్టోరీతోపాటు యాక్షన్ కూడా సినిమాలో మెయిన్ గా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా మాటలు లేని హీరో రోల్ లో అనీష్ కనిపించే తీరు సినిమాకు స్పెషాలిటీని తీసుకొస్తోంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో అనీష్ తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అర్జున్ రోల్ తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. ఆ పాత్ర చేయగలనని మొదట నమ్మింది నిర్మాత వెంకీ కుడుములేనని చెప్పారు. ఆయన నమ్మకంతోనే ప్రయాణం మొదలైందని తెలిపారు. దర్శకుడు మహేశ్ ఉప్పల కథ చెప్పగానే వెంటనే తనకు కనెక్ట్ అయిందన్నారు. సినిమాలో అర్జున్ పాత్రకు మాటలు లేకపోయినా.. భావాలను ప్రేక్షకులకు చేరవేయడం పెద్ద సవాలుగా అనీష్ చెప్పారు.
రెండేళ్ల జర్నీలో ఎంతో నేర్చుకున్నానని, తనను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ తెలిపారు. యాక్షన్ కూడా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులు దాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అనస్వర రాజన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఆ సినిమా తనకు చాలా ప్రత్యేకమని ఆమె చెప్పింది. అనీష్ కూడా ఆమె చాలా యాక్ట్ చేశారని ప్రశంసించారు.
దర్శకుడి ఆలోచనలకు సినిమాటోగ్రాఫర్ రాజా మహదేవన్ విజువల్స్, తమన్ సంగీతం తోడవడంతో ఇట్లు అర్జున టీజర్ కు మంచి ఇంపాక్ట్ వచ్చింది. మాటలు లేకుండా ప్రేమను చెప్పే అర్జున్ స్టోరీని స్క్రీన్ పై ఎలా చూపించారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్టోబరు 30వ తేదీన సినిమా విడుదల కానుండటంతో.. అర్జున్ మాటలు లేకుండానే తన ప్రేమను ప్రేక్షకుల మనసుల్లోకి ఎంత స్ట్రాంగ్ గా తీసుకెళ్తారో వేచి చూడాలి.
