Begin typing your search above and press return to search.

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

ఇందులో హీరో అర్జున్ పాత్ర చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. మాటలు రాని ఒక యువకుడిగా అనీష్ కనిపించడం విశేషం.

By:  M Prashanth   |   4 Nov 2026 6:38 PM IST
ఇట్లు అర్జున ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్
X

కింగ్ నాగార్జున సమర్పణలో, దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి తెరకెక్కించిన మూవీ ఇట్లు అర్జున. కొత్త కుర్రాడు అనీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ విడుదల చేయడంతో మంచి బజ్ వచ్చింది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ఒక ప్రామిసింగ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా సాగింది. యూత్‌ను ఆకట్టుకునే లవ్ ట్రాక్‌తో పాటు కాస్త ఇంటెన్స్ క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి ట్రైలర్ ను నీట్‌గా కట్ చేశారు.





ఇందులో హీరో అర్జున్ పాత్ర చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. మాటలు రాని ఒక యువకుడిగా అనీష్ కనిపించడం విశేషం. సైగలతోనే తన భావాలను, ప్రేయసిపై ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరిచే తీరు కొత్తగా ఉంది. పద్ధతిగా ఉంటూ చదువుకునే కాలేజ్ అమ్మాయి పాత్రలో అనస్వర రాజన్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించింది. మాటల్లో చెప్పలేనంత ప్రేమను కళ్లతోనే పండించే లవ్ స్టోరీ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. వీరిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు సహజంగా కుదిరాయి.

కేవలం ఫీల్ గుడ్ ప్రేమకథ మాత్రమే కాకుండా కథలో బలమైన కాన్‌ఫ్లిక్ట్ తీసుకొచ్చారు. వేయి కోట్ల విలువైన ఒక పెన్‌డ్రైవ్ చుట్టూ తిరిగే క్రైమ్ డ్రామా సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉంది. లోకల్ గ్యాంగులు, రౌడీలు వెంటపడటం, పోలీస్ ఛేజింగ్‌లతో యాక్షన్ డోస్ గట్టిగానే పెంచారు. ముఖేష్ రుషి, కలైయరసన్ విలనిజం ట్రైలర్‌లో ఇంటెన్స్ వైబ్‌ను తీసుకొచ్చింది. అసలు ఆ పెన్‌డ్రైవ్ సమస్యలోకి హీరో ఎలా వచ్చాడనేది ఆసక్తి రేపుతోంది.

దర్శకుడు మహేష్ ఉప్పల రాసుకున్న స్క్రిప్ట్‌లో రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ మూడ్స్‌ను చక్కగా బ్యాలెన్స్ చేసినట్లు కనిపిస్తోంది. మొదటి సినిమాతోనే ఇలాంటి సవాలుతో కూడిన మూగ పాత్రను ఎంచుకుని అనీష్ మంచి సాహసమే చేశాడు. ఛేజింగ్ సీన్లలో చూపించిన ఎనర్జీ, ఎమోషనల్ సీన్లలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఒక కొత్త నటుడిలా కాకుండా చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించాయి. డైలాగ్స్ లేకపోయినా తన బాడీ లాంగ్వేజ్‌తోనే క్యారెక్టర్‌ను నడిపించేందుకు బాగానే కష్టపడ్డాడు.

టెక్నికల్ పరంగా చూస్తే తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ ట్రైలర్‌కు పెద్ద అసెట్‌గా నిలిచింది. ఇప్పటికే పాటలతో అలరించిన తమన్, ఈ ట్రైలర్‌లో లవ్ సీన్లకు తగ్గ ఫీల్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌కు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా నేచురల్‌గా, కలర్‌ఫుల్ విజువల్స్‌తో సాగింది. రూఫ్‌టాప్ ఫైట్స్, రాత్రి వేళల్లో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు స్క్రీన్ పై రిచ్‌గా కనిపించాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

ట్రైలర్ డీసెంట్ పాజిటివ్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేసింది. మూగ హీరో పాయింట్‌కు పక్కా కమర్షియల్ హంగులను జోడించి చేసిన ఈ ప్రయోగం థియేటర్లలో ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఎక్కడా అతిగా వెళ్లకుండా సినిమా మూడ్‌ను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. నవంబర్ 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.