Begin typing your search above and press return to search.

ఐటం భామ‌ల కార‌ణంగా నెల‌ల స‌మ‌యం వృద్దా!

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ లో కమర్షియల్ హంగులకు ప్రాధాన్యత పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ అనేది సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది.

By:  Srikanth Kontham   |   21 April 2026 6:45 PM IST
ఐటం భామ‌ల కార‌ణంగా నెల‌ల స‌మ‌యం వృద్దా!
X

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ లో కమర్షియల్ హంగులకు ప్రాధాన్యత పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ అనేది సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ ఒక్క పాట కోసం సరైన భామను ఎంపిక చేయడంలో దర్శక,నిర్మాతలు పడుతోన్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కథానాయికల ఎంపిక సులువుగానే ఉన్నా? స్పెషల్ సాంగ్‌లో మెరిసే భామ కోసం నెలల తరబడి సమయం వృధా అవుతుండటం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే కేవలం వాటికే పరిమితమైన నటీమణులు ఉండేవారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏ హీరోయిన్ అయితే సినిమాకు అదనపు క్రేజ్ వస్తుంది? ఎవరి డ్యాన్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి? అనే లెక్కలతో మేకర్స్ తలమునకలవుతున్నారు. ఈ క్రమంలో ముంబై నుండి చెన్నై వరకు గాలించినా డేట్స్ సర్దుబాటు కాకపోవడం, రెమ్యునరేషన్ భారీగా అడగడంతో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి.

పెద్ద హీరోల సినిమాల్లో షూటింగ్ మొత్తం పూర్తయినా? ఐటం పాట చిత్రీకరణ మిగిలిపోవడం వల్ల విడుదల తేదీలు కూడా మారుతోన్న సందర్భాలున్నాయి.

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్ కోసం సరైన నటి దొరక్క ఇప్ప‌టికీ ఐటం పాట పెండింగ్ లోనే ఉంది. మృణాల్ ఠాకూర్ ఫైన‌ల్ అయింద‌ని ప్ర‌చారం జ‌రిగింది గానీ అందులో వాస్త‌వం లేద‌ని తేలిపోయింది. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన `పెద్ది` వాయిదాకు కార‌ణాల్లో ఇదొక్క‌డి కూడా. పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ అవ్వాలనే పట్టుదల దర్శకుల్లో ఉండటం మంచిదే అయినా? అది సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతోంది. ఐటమ్ సాంగ్ అనేది సినిమా ప్రమోషన్‌కు వెన్నెముక లాంటిది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించాలన్నా? థియేటర్లు ఈలలతో మోతెక్కాల‌న్నా? ఆ పాటలో మెరిసే నటి గ్లామర్ , ఎనర్జీ అత్యంత కీల‌కం.

అందుకే దర్శకులు దేశమంతా వెతికి మరీ బాలీవుడ్ లేదా ఇతర భాషల నుండి టాప్ హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్నారు. కానీ ఈ వేటలో విలువైన సమయం వృధా అవ్వడం వల్ల హీరోల తదుపరి చిత్రాల లైనప్ కూడా దెబ్బతింటోంది. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అవసరమే. కానీ వాటి కోసం నిర్మాణ ప్రక్రియను నెలల తరబడి ఆపివేయడం సమంజసం కాద‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతుంది. సృజనాత్మకత పేరుతో కాలయాపన చేయడం కంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా సమస్యకు పరిష్కారం గా చూడొచ్చు.