2025 మాస్ ప్రియులకు "స్పెషల్" డిజప్పాయింట్..!
స్టార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అనేవి ఎప్పుడు సంథింగ్ స్పెషల్ అనిపిస్తాయి. ఆ సాంగ్స్ ని ఎందుకు పెడతారనే వాళ్లు ఉన్నారు కానీ అది ఉంటే ఎంజాయ్ చేసే వాళ్లు ఎక్కువ శాతం మంది ఉంటారు.
By: Ramesh Boddu | 12 Dec 2025 4:00 PM ISTస్టార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అనేవి ఎప్పుడు సంథింగ్ స్పెషల్ అనిపిస్తాయి. ఆ సాంగ్స్ ని ఎందుకు పెడతారనే వాళ్లు ఉన్నారు కానీ అది ఉంటే ఎంజాయ్ చేసే వాళ్లు ఎక్కువ శాతం మంది ఉంటారు. అందుకే కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఆనవాయితీ తరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఐతే లాస్ట్ ఇయర్ కూడా ఈ స్పెషల్ సాంగ్స్ కొన్ని సెసేషనల్ అనిపించాయి. కానీ 2025లో మాత్రం స్పెషల్ సాంగ్ ఒక్కటంటే ఒక్కటి అదుర్స్ అనిపించేలా రాలేదు.
ఆడియన్స్ ని స్టెప్పులు వేయించే స్పెషల్ సాంగ్స్ ..
సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి స్పెషల్ సాంగ్స్ కూడా వచ్చాయి కానీ ఏది కూడా ఆడియన్స్ ని స్టెప్పులు వేయించేలా చేయలేదు. కనీసం విజిల్స్ మోత కూడా వేయించలేదంటే షాక్ అవ్వాల్సిందే. ఈ ఇయర్ కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఎట్రాక్ చేస్తాయని అంచనా వేయగా అవి కూడా నిరాశపరిచాయి.
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే రాహు కేతు సినిమాలో మధిర అనే సాంగ్ చేసింది. పులకిత్ సామ్రాట్, వరుణ్ శర్మ తో చేసిన ఈ సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేదు. షాలిని గ్లామర్ తో ఎంత ఎట్రాక్ట్ చేయాలని చూసినా కూడా సాంగ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇదే క్రమంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీయ శరన్ తో కనకం అనే స్పెషల్ ఆంగ్ ప్లాన్ చేశారు నాన్ వైలెన్స్ టీం. కానీ ఆ సాంగ్ కూడా ఆకట్టుకోవడంలో విఫలమైంది. మెట్రో శిరీష్ చేసిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. ఐతే అసలేమాత్రం ఆకట్టుకోలేని ఈ స్పెషల్ సాంగ్ ఆడియన్స్ ఎట్రాక్షన్ ని సంపాదించలేదు.
ప్రేక్షకుల మనసులు గెలుచుకోలేని స్పెషల్ సాంగ్..
నెక్స్ట్ అందాల భామలు కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ చేసిన జినీ స్పెషల్ సాంగ్ కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకోలేదు. రవి మోహన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఈ సాంగ్ ఎట్రాక్ట్ చేస్తుందని అనుకోగా టార్గెట్ మిస్ అయ్యింది. అందాల భామలు ఇద్దరు గ్లామర్ ట్రీట్ చేసినా కూడా లాభం లేకపోయింది. ఇక ఇదే దారిలో బాగి 4లో జాకీ ష్రాఫ్ కోసం సోనం బజ్వా చేసిన స్పెషల్ సాంగ్ కూడా అసలేమాత్రం ఆకట్టుకోలేదు. సోనం లుక్స్ పరంగా ఇంప్రెస్ చేసినా సాంగ్ మాత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేదు.
స్పెషల్ సాంగ్ కి కేరాఫ్ అడ్రస్ అయిన మలైకా అరోరా చేసిన థమ సాంగ్ కూడా ఈసారి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. సాంగ్ లో మలైకా అందాల మాయ చేసినా కూడా సాంగ్ పరంగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.
ఐతే ఈ సాంగ్స్ అన్నీ కూడా స్పెషల్ అప్పియరెన్స్ గా వచ్చినా అవి ఆడియన్స్ హృదయాలను చేరడంలో ఫెయిల్ అయ్యాయి. ఐతే థమన్నా చేసిన స్పెషల్ సాంగ్స్ మాత్రం ఇంప్రెస్ చేశాయి. ఘఫూర్ వెబ్ సీరీస్ తో పాటు రైడ్ 2 కోసం చేసిన సాంగ్ కూడా స్పెషల్ సాంగ్ లవర్స్ ని అలరించాయి. మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ కి పర్ఫెక్ట్ అని మరోసారి ఈ సాంగ్స్ తో ప్రూవ్ చేసుకుంది. ఐతే మిగతా సాంగ్స్ అన్నీ కూడా భారీ హంగామాతో వచ్చినా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి.
