Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తెల్ల చీర‌లో భూలోక‌ రంభ‌లా మెరిసిపోతోంది

చిత్రపరిశ్రమలో తనదైన అంద చందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది అందాల భామ ఐశ్వర్య మీనన్.

By:  Sivaji Kontham   |   20 Aug 2026 10:01 AM IST
ఫోటో స్టోరి: తెల్ల చీర‌లో భూలోక‌ రంభ‌లా మెరిసిపోతోంది
X

చిత్రపరిశ్రమలో తనదైన అంద చందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది అందాల భామ ఐశ్వర్య మీనన్. తాజాగా ఈ భామ సాంప్రదాయకమైన తెల్ల చీరలో మెరిసిపోతున్న‌ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఓణం పండుగను పురస్కరించుకుని ఈ ప్రత్యేకమైన ట్రెడిషనల్ లుక్‌ను అభిమానులతో షేర్ చేసిన‌ ఐశ్వర్య ``దీన్ని నా ఓణం వార్మ్ అప్`` అని పేర్కొంటూ క్యాప్షన్ ఇచ్చారు. తెల్లటి చీరకి కాంబినేషన్‌గా ఈ మాలీవుడ్ బ్యూటీ ధరించిన ఎంబ్రాయిడరీ పింక్ బ్లౌజ్ త‌న అందాన్ని మరింతగా ఎలివేట్ చేస్తూ.. సోషల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల‌వుతోంది.




ఐశ్వర్య మీనన్ షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. వైట్ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఎంతో ముచ్చటగా ఉన్న ఐశ్వ‌ర్య‌ సాంప్రదాయ లుక్‌ను ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ పోస్ట్ కింద లవ్- ఫైర్ ఎమోజీలతో పాటు `భూలోక రంభ‌`, `ర‌సిక రాణి`, `బ్యూటిఫుల్`, `క్వీన్`, `హాట్ అండ్ క్లాసీ` అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మలయాళీ పండుగ ఓణం సందర్భంగా నెటిజన్లు ఈ భామ‌కు ముందస్తుగా హ్యాపీ ఓణం అని శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.




గ్లామర్‌తో మాత్రమే కాకుండా సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా ఐశ్వర్య మీనన్ భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రతిష్టాత్మక జీఆర్‌టి జువెలర్స్ వంటి ప్రముఖ బ్రాండ్లతో పెయిడ్ పార్ట్‌నర్‌షిప్ చేస్తూ.. ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ యాడ్ పోస్ట్ లేదా రీల్‌కు రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్లు, డిజిటల్ ప్రకటనల ద్వారా ఈ బ్యూటీకి నెలకు రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు ఆదాయం అందుతోంది. ఈ ప్రకటనలు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్ల నుండి రూ. 2.5 కోట్ల వరకు ఆర్జిస్తూ వ్యాపార వర్గాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.




సోషల్ మీడియా సంపాదనతో పాటు ఈవెంట్లు... ప్రారంభోత్సవాల్లో కూడా ఐశ్వర్య మీనన్ హవా కొనసాగుతోంది. ప్రముఖ జువెలరీ షోరూమ్స్, షాపింగ్ మాల్స్- ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొని రిబ్బన్ కటింగ్ (స్టోర్ లాంచ్) చేయడానికి ఈ ప్ర‌తిభావ‌ని సుమారు రూ. 3 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు ఫీజుగా తీసుకుంటారు. ఒక గంట లేదా రెండు గంటల సమయం కేటాయించే ఈ ఈవెంట్లతో పాటు.. క్రమం తప్పకుండా వరుస యాడ్స్‌లో కనిపిస్తూ సౌత్ ఇండియాలో అత్యధిక డిమాండ్ ఉన్న కమర్షియల్ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచారు.




ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య మీనన్ 2026 నాటికి తన కెరీర్‌పై పూర్తి దృష్టి సారించి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే `స్పై`, `భజరంగి 2` వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కొన్ని క్రేజీ తమిళ, తెలుగు ప్రాజెక్టులలో నటిస్తున్నారు. 2026లో విడుదల కానున్న ఈ కొత్త చిత్రాల్లో త‌న‌ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉండటంతో పాటు.. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ద్వారా బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.