Begin typing your search above and press return to search.

మత్తెక్కించే కళ్ళతో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య మీనన్!

పైన చిన్న టాప్ కింద జీన్స్ ప్యాంట్ తో ఫోటోలకు ఫోజులిచ్చిన ఐశ్వర్య మీనన్ అందాలకు చాలామంది నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

By:  Madhu Reddy   |   1 Nov 2025 7:00 PM IST
మత్తెక్కించే కళ్ళతో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య మీనన్!
X

ఐశ్వర్య మీనన్..ఈ పేరు పెద్దగా తెలుగు వారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో పేరున్న సినిమాలేవి ఈ హీరోయిన్ కి ఇంకా పడలేదు. టాలీవుడ్ లో గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన హాట్ ఫోటోలు కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి. తాజాగా ఐశ్వర్య మీనన్ అద్దం ముందు నిల్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుని మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో అద్దం ముందు నిల్చున్న ఐశ్వర్య మీనన్ హాట్ ఫోజులు పెట్టి నడుము అందాలను హైలెట్ చేసింది..





పైన చిన్న టాప్ కింద జీన్స్ ప్యాంట్ తో ఫోటోలకు ఫోజులిచ్చిన ఐశ్వర్య మీనన్ అందాలకు చాలామంది నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ హీరోయిన్ హాట్ ఫోజులకు హాట్ హాట్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అలా సింపుల్ డ్రెస్ లో హెయిర్ లీవ్ చేసి సాదాసీదా లుక్ తోనే ఐశ్వర్య మీనన్ తన చూపులతో మత్తెక్కిస్తుంది. కిల్లింగ్ లుక్స్ తో ఈ హీరోయిన్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అలాగే మిర్రర్ ఒక గొప్ప మిత్రుడు అలాగే విమర్శకుడు అన్నట్లుగా ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.





ఐశ్వర్య మీనన్ ఫొటోల గురించి పక్కన పెడితే..ఆమె తమిళ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా కాదలిల్ సోదుప్పువదు ఎప్పడి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అనే సినిమా చేసినప్పటికీ ఈ మూవీ ఐశ్వర్య మీనన్ కి అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దాంతో తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో మళ్లీ తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసింది. అలా చివరికి తెలుగులో మళ్లీ రవితేజ హీరోగా నటించిన ఖిలాడి మూవీ లో ఆఫర్ వచ్చింది. ఈ సినిమా తర్వాత నిఖిల్ హీరోగా చేసిన స్పై, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా చేసిన భజే వాయువేగం సినిమాలో నటించింది.





కానీ ఐశ్వర్య మీనన్ ఇన్ని సినిమాలు చేసినా ఇప్పటివరకు అయితే హీరోయిన్ గా అంత గుర్తింపు అయితే రాలేదు. మరి ముందు ముందు ఈ హీరోయిన్ ఎంచుకునే సినిమాలైనా ఈమెకు పేరు తెచ్చి పెడతాయో లేదో చూడాలి.

ఐశ్వర్య మీనన్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్, పలు వెబ్ సిరీస్ లలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక ఈ హీరోయిన్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. మలయాళం లో భజూకా అనే సినిమా తప్ప ఈ హీరోయిన్ చేతిలో వేరే సినిమాలు లేవని తెలుస్తోంది.అలా సినిమాల్లో ఆఫర్స్ కోసం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తోంది.