యంగ్ హీరో సీ-ఫేసింగ్ లగ్జరీ హోమ్!
సముద్రపు అందాలు కనిపించేలా డిజైన్ చేసిన ఇంట్లో అడుగుపెట్టగానే ప్రత్యేకమైన శాంతి, సౌకర్యం లభిస్తాయని ఇషాన్ తెలిపారు.
By: Srikanth Kontham | 29 Aug 2026 1:00 PM ISTబాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఇషాన్ ఖట్టర్ ఇప్పుడిప్పుడే పరిశ్రమలో ఎదుగుతున్నాడు. యూత్ టార్గెట్ గా కథలు ఎంచుకుని క్రేజ్ ని అంకంతంతకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఫ్యాష్ అండ్ ట్రెండ్స్ ఫాలో అవ్వడంలో ఇషాన్ ఏమాత్రం రాజీ పడడు. స్టైలిష్ లుక్ లో ఆద్యంతం అలరిస్తుంటాడు. అలాగే వ్యక్తిగత లైఫ్‌స్టైల్‌తోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో తన డ్రీమ్ హోమ్ విశేషాలను పంచుకున్నారు. అరేబియా సముద్ర తీరానికి సమీపంలో ఉన్న లగ్జరీ 3-బిహెచ్‌కే ఇల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
సముద్రపు అందాలు కనిపించేలా డిజైన్ చేసిన ఇంట్లో అడుగుపెట్టగానే ప్రత్యేకమైన శాంతి, సౌకర్యం లభిస్తాయని ఇషాన్ తెలిపారు. ముఖ్యంగా సూర్యాస్తమయం వేళ సముద్రపు అలల సౌండ్, ఆకాశం రంగులు మారే దృశ్యాలు తన మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయని పేర్కొన్నారు. ఆధునిక నిర్మాణం , పాతకాలపు జ్ఞాపకాల కలయికగా ఈ ఇల్లు రూపుదిద్దుకుంది. ఇంటి ఇంటీరియర్స్ విషయంలో ఇషాన్ వ్యక్తిగత అభిరుచులకు పెద్దపీట వేశారు. ఇంట్రెస్టింగ్ మేక్ ఓవర్‌గా నిలిచే వింటేజ్ బాలీవుడ్ ఫిలిం పోస్టర్లు గోడలపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పాతతరం భారతీయ సినిమా పట్ల తనకున్న అమితమైన ప్రేమను, గౌరవాన్ని ఈ పోస్టర్లు ప్రతిబింబిస్తున్నాయి. ఇల్లు కేవలం బస చేసే స్థలం మాత్రమే కాదు. తన కళాత్మక ఆలోచనలకు ప్రతిరూపంగా ఉండాలని ఇషాన్ భావిస్తున్నట్లు అతడి టేస్ట్ ను బట్టి అర్దమవుతోంది. ఇంట్లో కేవలం సినిమా పోస్టర్లే కాకుండా ఇషాన్ సంగీత ప్రేమను చాటేందుకు క ప్రత్యేకమైన మ్యూజిక్ కార్నర్ కూడా ఉంది. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదించడం, వివిధ రకాల వాయిద్యాలను ప్లే చేయడం ఇషాన్‌కు ఎంతో ఇష్టం. దీనితో పాటు తన సినీ ప్రయాణంలో సాధించిన పురస్కారాలు, ప్రయాణాల్లో సేకరించిన జ్ఞాపకాలు ఇంటి ప్రశాంతమైన వాతావరణానికి మరింత శోభను చేకూర్చాయి.
ముంబై లాంటి రద్దీ నగరంలో ప్రశాంతమైన జీవనశైలిని కోరుకునే ఇషాన్ అభిరుచులకు తగ్గట్లుగా ప్రశాంతత ..కళాత్మకత ఉట్టిపడేలా నివాసాన్ని తీర్చిదిద్దుకున్నారు. బాలీవుడ్‌లో తనకంటూ సొంత స్థానాన్ని ఏర్పరచుకున్న యంగ్ స్టార్ కష్టార్జితంతో నిర్మించుకున్న కలల సౌధం అభిమానులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. మొత్తానికి వింటేజ్ సొగసులు ..మోడర్న్ లగ్జరీ కలగలిసిన ఇషాన్ ఖట్టర్ బాంద్రా హోమ్ పిక్చర్స్ ..డీటైల్స్ నెట్టిం ట వైరల్ అవుతున్నాయి. సముద్రపు గాలులు, మ్యూజిక్, సినిమా జ్ఞాపకాల మధ్య అలరారుతున్న ఇషాన్ ఇల్లు ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
