ఛాన్సుల కోసం ఏడవలేను
సరే వాటిని ఫేస్ చేద్దామనుకుని అంతా రెడీ అయి ఆడిషన్ కు వెళ్తే ఆ ఆడిషన్ అసలు ఊహించని విధంగా ఉంటుందంటోని చెప్తున్నారు బాలీవుడ్ నటి ఇషా తల్వార్.
By: Sravani Lakshmi Srungarapu | 9 Aug 2025 1:00 AM ISTఎవరైనా ఇండస్ట్రీలోకి రావడం, అక్కడ రాణించడం అంత ఈజీ కాదు. సినీ ఇండస్ట్రీ చూడ్డానికి మాత్రమే రంగుల ప్రపంచం. అందులో నిలదొక్కుకుని ఎదగాలంటే చాలా కష్టాలు, ఇబ్బందులు పడాలి. యాక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఎన్నో ఆడిషన్స్ ఇవ్వాలి. కొత్తవాళ్లకైతే ఆ ఆడిషన్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా కష్టంగా కూడా అనిపిస్తాయి.
సరే వాటిని ఫేస్ చేద్దామనుకుని అంతా రెడీ అయి ఆడిషన్ కు వెళ్తే ఆ ఆడిషన్ అసలు ఊహించని విధంగా ఉంటుందంటోని చెప్తున్నారు బాలీవుడ్ నటి ఇషా తల్వార్. కెరీర్ స్టార్టింగ్ లో తాను కూడా అలాంటి ఆడిషన్ ను ఫేస్ చేసినట్టు తనకు జరిగిన వింత అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తాను ఓ ఆడిషన్ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ కు చెందిన క్యాస్టింగ్ డైరెక్టర్ షనూ శర్మను కలిశానని, ఆడిషన్ లో భాగంగా తనకు ఓ రెస్టారెంట్ లో సీన్ ఉందని అక్కడికి తీసుకెళ్లి అందరి మధ్యలో గట్టిగా ఏడవాలని చెప్పారని ఇషా తెలిపారు.
ధైర్యం సరిపోలేదు
నటి అవాలనుకున్నప్పుడు ఎలాంటి సీన్స్ కైనా నో చెప్పకూడదని చెప్పారని, రెస్టారెంట్లో అందరూ తింటూ కబుర్లు చెప్పుకుంటుంటే అక్కడ అందరికీ వినిపించేలా ఏడవమని చెప్పి తన అసిస్టెంట్లతో పాటూ షనూ కూడా తన ముందే కూర్చుందని, ఆమె చెప్పిన మాటలు విన్నాక తనకు ఏమీ అర్థం కాక అంతా అయోమయంగా అనిపించడంతో పాటూ అలా చేయడానికి ధైర్యం సరిపోలేదని, ఒకమ్మాయిని అలా అంతమందిలో ఏడిపించడం దేనికో తనకసు అర్థం కాలేదని ఇషా తల్వార్ చెప్పారు.
ఎవరైనా ఆడిషన్ అంటే ఆఫీసులోనో, మరేదైనా సెట్‌లోనో పెట్టుకుంటారు కానీ ఇలా చేయడం ఏంటని, అసలు ఇదేం ఆడిషన్ అనుకున్నానని, అలా చేయడం తన వల్ల కాదని చెప్పడంతో తనకు ఆ సినిమాలో ఛాన్స్ రాలేదని, ఛాన్సుల కోసం ఇలా రెస్టారెంట్ లో ఏడవలేని చెప్పినట్టు తెలిపిన ఇషా, ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వాళ్ల కోసమే తాను ఈ స్టోరీని పెడుతున్నట్లు కూడా తెలిపారు.
