Begin typing your search above and press return to search.

రాజాసాబ్‌..ఆ సినిమాతో పోలుస్తున్నారేంటీ?

పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన భారీ పాన్ ఇండియా మూవీ `ది రాజాసాబ్‌`.

By:  Tupaki Entertainment Desk   |   9 Jan 2026 5:05 PM IST
రాజాసాబ్‌..ఆ సినిమాతో పోలుస్తున్నారేంటీ?
X

పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన భారీ పాన్ ఇండియా మూవీ `ది రాజాసాబ్‌`. యాక్ష‌న్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌భాస్ నుంచి వ‌స్తున్న ఫ‌స్ట్ హార‌ర్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో `ది రాజాసాబ్‌` మూవీపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన `ది రాజాసాబ్‌` ఫైన‌ల్‌గా ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయినా ఈ సినిమాపై తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వైర‌ల్‌గా మారింది.

బాలీవుడ్ హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో రూపొందిన‌ హిట్ ఫిల్మ్ `భూల్ బుల‌య్యా`ను పోలివుందంటూ కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన కామెడీ థ్రిల్ల‌ర్‌కు `ది రాజాసాబ్‌`కు ద‌గ్గ‌రి సంబంధాలున్నాయ‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుతోంది. దీనిపై మేక‌ర్స్ తాజాగా స్పందించారు. ఇది పూర్తిగా భిన్న‌మైన క‌థ అని, ప్ర‌భాస్ కోసం సరికొత్త ప్ర‌పంచాన్ని సృష్టించామ‌ని నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ స్ప‌ష్టం చేశారు. భార‌త్‌లోనే అతిపెద్ద సూప‌ర్ స్టార్ ప్ర‌భాస్. త‌న‌ని దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌ను సిద్ధం చేయించాం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి క‌థ రాలేదు. విజువ‌ల్స్ కూడా కొత్త‌గా ఉంటాయి` అని తెలిపారు. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్‌లు న‌టించారు. వాళ్ల‌లో ఒక‌రైన రిద్దికుమార్ కూడా ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించారు. `భూల్ బుల‌య్యా` ఓ అద్భుత‌మైన సినిమా అన్నారు. నాకు న‌చ్చిన సినిమాల్లో ఇది కూడా ఒక‌ట‌న్నారు. ఫాంట‌సీ అంటేనే లేనిదాన్ని సృష్టించ‌డం. రాజాసాబ్ దానిలా ఉండ‌దు. ఇందులో ఎన్నో ఎమోష‌న్స్ ఉన్నాయి. వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.

మ‌రో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ఈ మూవీ `భూల్ బుల‌య్యా` అంత హిట్ కావాల‌న్నారు. ఇదిలా ఉంటే `ది రాజాసాబ్‌` ఎండింగ్‌లో ఈ హార‌ర్ కామెడీకి సీక్వెల్ మూవీ కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. `రాజాసాబ్ స‌ర్క‌స్: 1935` అంటూ కొన‌సాగింపుకు లీడ్ ఇచ్చారు. అందులో ట్రైల‌ర్‌లో ఉన్న స‌న్నివేశాలు, ప్ర‌భాస్ ఓల్డ్‌గెట‌ప్ సినిమాలో క‌నిపించ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో రెండో భాగంలో ఆ స‌న్నివేశాలు ఉంటాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

1993లో మోహ‌న్‌లాల్‌, సురేష్ గోపీ, శోభ‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన సైక‌లాజిక‌ల్ హార‌ర్ డ్రామా `మ‌ణిచిత్ర‌తాళ్`. అప్ప‌ట్లో ఈ సినిమా ఏస్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. దీన్నే త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా 2005లో `చంద్ర‌ముఖి`గా రీమేక్ చేశారు. ర‌జ‌నీ కెరీర్‌ని మ‌లుపుతిప్పి మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. `మ‌ణిచిత్ర‌తాళ్‌`లోని ప్ర‌ధాన క్యారెక్ట‌ర్‌లు స‌న్నీ, న‌కుల‌న్ ల‌ని కొన‌సాగిస్తూ ప్రియ‌ద‌ర్శ‌న్ `గీతాంజ‌లి` పేరుతో హార‌ర్ మూవీ చేశాడు అదీ హిట్ అయింది. దాన్నే హిందీలో `భూల్ బుల‌య్యా 2`గా రీమేక్ చేస్తే అదీ హిట్టే.