'ఇండియన్ -3' అటెకెక్కినట్లేనా?
'ఇండియన్ -3' అటకెక్కినట్లేనా? రిలీజ్ అసాధ్యమేనా? అంటే సన్నివేశం దాదాపు అలాగే కనిపిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఇదే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
By: Srikanth Kontham | 3 Dec 2025 12:08 PM IST'ఇండియన్ -3' అటకెక్కినట్లేనా? రిలీజ్ అసాధ్యమేనా? అంటే సన్నివేశం దాదాపు అలాగే కనిపిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఇదే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా రిలీజ్ సాధ్యం కాలేదన్నది వెలుగులోకి వచ్చిన వార్త. ఆ తర్వాత అదే వార్త ఓ ప్రచారంగా మారింది. రిలీజ్ వార్త ఎప్పుడొచ్చినా? పనులు పూర్తి కాలేదు ఆ కారణంగానే రిలీజ్ అవ్వలేదు అన్నది పరిపాటిగా మారింది. దాదాపు ఆరెడు నెలలు పాటు ఇలాగే మీడియాలో కథనాలొచ్చాయి. అంతకు ముందు ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.
ఓటీటీ రిలీజ్ కూడా లేదే:
'ఇండియన్ 2' ప్లాప్ అయిన నేపథ్యంలో 'ఇండియన్ 3' రిలీజ్ చేసి ఇంకా నష్టాల ఊబిలోకి వెళ్లడం కన్నా? నిర్మాతలు సేఫ్ సైడ్ చూస్తున్నారని, ఈ క్రమంలో ఓటీటీకి అమ్మేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత వాటిని మేకర్స్ ఖండించారు. ఓటీటీ లో కాదు..నేరుగా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఓటీటీ రిలీజ్ సమయంలోనే అలా చేస్తే గనుక శంకర్ కి అది భంగపాటుగా మారుగుతుందని మీడియాలో కథనాలు వేడెక్కించాయి. దీంతో వాటిని థియేటర్లోనే రిలీజ్ చేస్తామని శంకర్ కూడా ఓటీటీ కథనాన్ని ఖండించారు.
శంకర్ కోసం పోటి పడిన హీరోలు:
కానీ ఇంత వరకూ ఓటీటీ రిలీజ్ లేదు..థియేట్రికల్ రిలీజ్ లేదు. ఇక రిలీజ్ కూడా ఉండదని తాజాగా అందుతోన్న సమాచారం. శంకర్ వేరే ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యాడని..'ఇండియన్ 3' ని పట్టించుకోలేదని తెలుస్తోంది. కానీ ఇలా రిలీజ్ ఆగిపోవడం అన్నది శంకర్ కి అతి పెద్ద భంగపాటే అవుతుంది. శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా రిలీజ్ కాకపో వడం అంటూ సర్వత్రా చర్చకు దారి తీస్తుంది. డైరెక్టర్ గా శంకర్ కి ఇండియాలో ఎలాంటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విజయాలు అందించాడు. వాటితో గొప్ప సందేశాన్ని జనాల్లోకి పంపించాడు. దీంతో ప్రతీ స్టార్ హీరో శంకర్ తో సినిమా చేయాలని ఆశపడిన వారే. ఇందులో మహేష్ కూడా ఉన్నారు.
ఆశలపై నీళ్లు చల్లినట్లేనా?
అలాంటి లెజెండరీ డైరెక్టర్ సినిమా రిలీజ్ ఆగిపోయిందంటే? డైరెక్టర్ వైఫల్యం మాత్రమే హైలైట్ అవుతుంది. లంచగొండులు భరతం పట్టిన భారతీయుడికి ఇంత అవమానమా? అన్న చర్చ తప్పదు. ఎందుకంటే ఇది భారతీయుడి ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతోన్న ప్రాజెక్ట్క కాబట్టి. 'ఇండియన్ 2' ఫెయిలైనా? 'ఇండియన్ 3' హిట్ అవుతుందని శంకర్ అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ల ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లే అవుతుంది.
