ఇరుముడి.. ఇప్పుడు శివ నిర్వాణ టాప్ లీగ్‌లోకి వెళ్తాడా!
కానీ ఇప్పుడు ‘ఇరుముడి’తో అదే ఎమోషన్‌కు పెద్ద కమర్షియల్ రిజల్ట్ కూడా చేరింది. సినిమా రూ.200 కోట్ల మార్క్ దాటడంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరివితో ఉంటుందన్న ఆసక్తి కూడా పెరిగింది.
By: M Prashanth | 13 Sept 2026 10:00 PM IST‘ఇరుముడి’ హిట్‌తో శివ నిర్వాణ పేరు ఇండస్ట్రీలో మళ్లీ బలంగా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఆయనకు ఎమోషన్‌ను బాగా హ్యాండిల్ చేసే దర్శకుడిగా పేరు ఉంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఆ విషయంలో మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ ఇప్పుడు ‘ఇరుముడి’తో అదే ఎమోషన్‌కు పెద్ద కమర్షియల్ రిజల్ట్ కూడా చేరింది. సినిమా రూ.200 కోట్ల మార్క్ దాటడంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరివితో ఉంటుందన్న ఆసక్తి కూడా పెరిగింది.
శివ నిర్వాణ ఇప్పటివరకు నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి హీరోలతో పని చేశారు. వీళ్లంతా మంచి మార్కెట్ ఉన్న హీరోలే. కానీ ఇంకా టాప్ లీగ్ స్టార్‌తో సినిమా చేయలేదు. మజిలీ తర్వాత టక్ జగదీష్, ఖుషి ఆశించిన స్థాయిలో పనిచేయకపోయినా, ‘ఇరుముడి’తో మళ్లీ పెద్ద హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన కెరీర్‌లోనే మంచి టైమ్ వచ్చింది.
‘నిన్ను కోరి’తో దర్శకుడిగా మొదలైన శివ నిర్వాణకు ‘మజిలీ’ తర్వాత స్టార్ హీరోల దగ్గర కూడా మంచి గుర్తింపు వచ్చింది. కానీ వరుసగా పెద్ద కమర్షియల్ సక్సెస్ మాత్రం దొరకలేదు. అందుకే ‘ఇరుముడి’ హిట్ ఆయన కెరీర్‌లో ఇప్పుడు మరింత ఉపయోగపడే అవకాశం ఉంది అనే టాక్ కూడా ఉంది. ఇక శివ నిర్వాణకు ఉన్న మరో ప్లస్ ఎమోషన్. స్టార్ హీరోల సినిమాల్లో యాక్షన్, స్కేల్ ఎంత ఉన్నా, కథలో పట్టుకునే భావోద్వేగం ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది.
‘ఇరుముడి’లో కూడా తండ్రి, కూతురు ట్రాక్ ఎక్కువగా మాట్లాడుకున్నారు. రవితేజ ఇమేజ్‌కు భిన్నంగా ఆ ఎమోషన్‌ను ముందుకు తీసుకురావడం కూడా దర్శకుడికి ప్లస్ అయింది. దానికి తోడు థ్రిల్లర్ ఫీల్ ను గట్టిగా ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ కూడా ‘ఇరుముడి’ టీమ్‌ను కలిసి అభినందించడం మరో హైలెట్ అయింది. ఇంతకుముందే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సినిమా గురించి మాట్లాడారు.
పెద్ద హిట్ తర్వాత ఒక దర్శకుల హీరోలు కథలు వినడానికి ఆసక్తి చూపడం నార్మల్. అయితే శివ నిర్వాణ దగ్గర ప్రస్తుతం ఏ కథ రెడీగా ఉందనేది ఇంకా చెప్పలేదు. అసలు ఆయన నెక్స్ట్ స్టెప్ ఇక్కడే ఆసక్తికరం. మరోసారి తనకు తెలిసిన రేంజ్ హీరోతోనే వెళ్లి త్వరగా సినిమా చేస్తారా? లేక ‘ఇరుముడి’ ఇచ్చిన మొమెంటమ్‌తో టాప్ స్టార్‌కు కథ చెబుతారా?
రెండోది జరిగితే బడ్జెట్, స్కేల్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. అప్పుడు శివ నిర్వాణ తన ఎమోషనల్ స్టైల్‌ను ఎంత పెద్ద క్యాన్వాస్‌లో చూపిస్తారన్నది మరో ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం ‘ఇరుముడి’ విజయంతో ఆయనకు మంచి టైమ్ వచ్చింది. దాన్ని వెంటనే మరో సినిమాతో ఉపయోగించుకోవాలి. అలాగే పెద్ద హీరోలు బిజీగా ఉండడంతో కొన్నాళ్ళు డేట్స్ కోసం కొంత వెయిట్ చేయక తప్పదు. ఇక ఏ కాంబినేషన్ సెట్ అయినా డైరెక్టర్ గా మాత్రం నిర్వాణ రేంజ్ మరో లెవెల్ కి వెళ్ళినట్లే.
