4 రోజుల్లోనే 100 కోట్లు.. 'ఇరుముడి' మరో రికార్డు
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ‘ఇరుముడి’ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటినట్లు మేకర్స్ ప్రకటించారు.
By: M Prashanth | 25 Aug 2026 9:42 AM ISTరవితేజకు ఒక హిట్ కావాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూశారు. కానీ ‘ఇరుముడి’ విషయంలో ఇప్పుడు హిట్ దగ్గరే లెక్క ఆగేలా కనిపించడం లేదు. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ వీకెండ్ మొత్తం బాగా పని చేసింది. అసలైతే సోమవారం వచ్చేసరికి ఎంత పెద్ద సినిమాకైనా డ్రాప్ కనిపిస్తుంది. కానీ ఈ సినిమాకు మాత్రం నాలుగో రోజు కూడా బుకింగ్స్ బలంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రెస్పాన్స్ చిత్ర యూనిట్‌కు మరింత కిక్ ఇస్తోంది. రీజినల్ సినిమాల్లో ఫస్ట్ మండే బుకింగ్స్ పరంగా ‘ఇరుముడి’ ఆల్ టైమ్ హయ్యెస్ట్ నమోదు చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. కొన్ని చోట్ల డే 1 స్థాయిలోనే బుకింగ్స్ కనిపించాయని వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో నాలుగో రోజు ఆక్యుపెన్సీ కూడా భారీగా ఉందని, ‘బాహుబలి 2’ తర్వాత ఇలాంటి రెస్పాన్స్ అరుదని టీమ్ చెబుతోంది.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ‘ఇరుముడి’ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటినట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ కెరీర్‌లో అత్యంత వేగంగా రూ.100 కోట్లకు చేరుకున్న సినిమా ఇదేనని చెబుతున్నారు. గతంలో ఆయన సినిమాలకు ఈ మార్క్ అందుకోవడమే పెద్ద విషయంగా ఉండేది. ఇప్పుడు కేవలం నాలుగు రోజుల్లోనే ఆ నంబర్ రావడం చూస్తుంటే ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రన్ ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు.
టికెట్ సేల్స్‌లోనూ మరో పెద్ద నంబర్ నమోదైంది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ కలిపి నాలుగు రోజుల్లో 36 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర బృందం తెలిపింది. పెద్ద ఓపెనింగ్ వచ్చిన సినిమాకు వీకెండ్ వరకు ఇలాంటి నంబర్స్ రావచ్చు. కానీ సోమవారం కూడా అదే జోరు కొనసాగడం ఇక్కడ అసలు ప్లస్. ఐదో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే బలంగా ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ముందుగానే ఫుల్స్ నమోదవుతున్నాయని చెబుతున్నారు.
రవితేజ గత కొంతకాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో ‘ఇరుముడి’ రావడం ఒక హిట్ కంటే ఎక్కువ బూస్ట్ ఇచ్చింది. శివ నిర్వాణ తీసుకున్న ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్ డ్రామా లైన్‌తో పాటు రవితేజ పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ కావడం సినిమాకు లాంగ్ రన్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం ఇప్పుడు కీలకంగా మారింది. ఇక ఈ రన్ వల్ల మరో లాభం కూడా ఉంది. రవితేజ నెక్స్ట్ సినిమాల బిజినెస్ దగ్గర ‘ఇరుముడి’ నంబర్స్ తప్పకుండా మాట్లాడతాయి. ఓపెనింగ్ మార్కెట్, ఓవర్సీస్ డిమాండ్, డిస్ట్రిబ్యూషన్ రేట్లు.. ఇవన్నీ మళ్లీ పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
