Begin typing your search above and press return to search.

నీ ద‌గ్గ‌ర యాక్టింగ్ నేర్చుకుంటా అంటూ.. న‌క్ష‌త్ర‌కు ధనుష్ ప్రశంసలు!

బాక్సాఫీస్ వద్ద ఇరుముడి జోరు కొనసాగుతోంది. రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 Aug 2026 1:41 PM IST
నీ ద‌గ్గ‌ర యాక్టింగ్ నేర్చుకుంటా అంటూ.. న‌క్ష‌త్ర‌కు ధనుష్ ప్రశంసలు!
X

బాక్సాఫీస్ వద్ద ఇరుముడి జోరు కొనసాగుతోంది. రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతోంది. స్టోరీ, ఎమోష‌నల్ సీన్స్ తో పాటూ నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ముఖ్యంగా రవితేజతో పాటు ఆయన కూతురి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర యాక్టింగ్ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తోంది.

సినిమాలో రవితేజ క్యారెక్ట‌ర్ కు, నక్షత్ర పోషించిన క్యారెక్ట‌ర్‌కు మధ్య ఉండే బాండింగ్ కథలో కీలకంగా ఉంటుంది. తండ్రి- కూతురు బంధాన్ని ప్రతిబింబించే సీన్స్ లో నక్షత్ర చూపించిన ఎమోషన్ ఆడియ‌న్స్ ను ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే ఇంత నేచుర‌ల్ గా యాక్ట్ చేయ‌డం సినీ వర్గాల్లోనూ డిస్క‌ష‌న్‌కు దారితీస్తోంది. ఇప్పటికే సినిమాను చూసిన పలువురు నక్షత్ర టాలెంట్‌ను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమెకు లభించిన ఓ అరుదైన అభినందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరుముడి సక్సెస్ మీట్ త‌ర్వాత ఇరుముడి డైరెక్ట‌ర్ శివ నిర్వాణ.. నక్షత్రను నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ధనుష్‌తో వీడియో కాల్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంగా ధనుష్ ఆమెతో ఆప్యాయంగా మాట్లాడటమే కాకుండా.. సినిమాలో ఆమె నటనను ప్రత్యేకంగా అభినందించారు.

నక్షత్రతో మాట్లాడిన సమయంలో ధనుష్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది. ఫ్యూచ‌ర్ లో ఇద్దరూ కలిసినప్పుడు.. ఆమె దగ్గర‌ యాక్టింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నానని చెప్ప‌డం ద్వారా న‌క్ష‌త్ర సినిమాలో ఎంత బాగా న‌టించిందో ఒక్క మాట‌లో చెప్పేసిన‌ట్టైంది. న‌క్ష‌త్ర టాలెంట్ ను మెచ్చుకుని, ఫ్యూచ‌ర్ లో మ‌రిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని కోరుకున్నారు. ఈ స్పెష‌ల్ మూమెంట్‌ను నక్షత్ర తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయ‌డంతో వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఒకవైపు ఇరుముడి రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తుండగా.. మరోవైపు నక్షత్ర యాక్టింగ్‌పై ప్రముఖుల ప్రశంసలు సినిమాకు ఎక్స్‌ట్రా ప్ర‌మోష‌న్ ను తీసుకొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రస్తుత థియేట్రిక‌ల్ ర‌న్ ను చూస్తుంటే, ఇరుముడి బాక్సాఫీస్ వ‌ద్ద‌ మరిన్ని మైలురాళ్లు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.