Begin typing your search above and press return to search.

ఇరుముడికి గణేష్ బోనస్.. రేట్లు తగ్గిస్తే?

ఈ శుక్రవారం నుంచి ఆదివారం వరకు వీకెండ్ ఉంది. వెంటనే సోమవారం వినాయక చవితి సెలవు వస్తోంది. అంటే ఇరుముడికి వరుసగా నాలుగు రోజులు ఉపయోగపడే అవకాశం ఉంది.

By:  M Prashanth   |   11 Sept 2026 9:33 AM IST
ఇరుముడికి గణేష్ బోనస్.. రేట్లు తగ్గిస్తే?
X

ఇరుముడి రిలీజ్ అయ్యి మూడు వారాలు పూర్తయ్యాయి. 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.225 కోట్ల గ్రాస్ దగ్గరకు చేరినట్లు ట్రేడ్ టాక్. 20వ రోజుకూ దేశవ్యాప్తంగా దాదాపు రెండు వేల షోలలో సినిమా నడిచింది. అది కూడా మూడో వారంలో. మొదటి వారం తర్వాత కూడా సినిమా నిలబడటం వల్ల రవితేజ కెరీర్‌లో గుర్తుండే రన్‌గా మారింది. కానీ టీమ్ ఇక్కడితో ఆపేలా కనిపించడం లేదు. ఈమధ్య మరోసారి సక్సెస్ సెలబ్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చే వీకెండ్‌ను కూడా వాడుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది.

ఈ శుక్రవారం నుంచి ఆదివారం వరకు వీకెండ్ ఉంది. వెంటనే సోమవారం వినాయక చవితి సెలవు వస్తోంది. అంటే ఇరుముడికి వరుసగా నాలుగు రోజులు ఉపయోగపడే అవకాశం ఉంది. కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చినా హైదరాబాద్‌లో పీవీఆర్, ఏఎంబీ, ప్రసాద్స్ సహా పలు మల్టీప్లెక్స్‌లలో ఇంకా షోలు కొనసాగుతున్నాయి. బుకింగ్స్ కూడా ఈ వీకెండ్ వరకు ఓపెన్‌లో ఉన్నాయి. మూడు వారాల సినిమా అయినా పూర్తిగా సైడ్ కాలేదనే అనిపిస్తోంది.

ఇరుముడికి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగా కలిసొచ్చారు. అయ్యప్ప దీక్ష, తండ్రి కూతురు ఎమోషన్ కారణంగా మాస్ సెంటర్లతో పాటు అర్బన్ ఏరియాల్లో కూడా వయసైన ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న వీడియోలు కనిపించాయి. సాధారణంగా రవితేజ సినిమాకు వచ్చే యూత్, మాస్ ఆడియెన్స్‌కు అదనంగా ఈ సెక్షన్ రావడం వల్లే లాంగ్ రన్‌కు కొంత సపోర్ట్ దొరికింది. ఇప్పటికీ అలాంటి ఆడియెన్స్‌లో సినిమా చూడని వాళ్లు ఉండే అవకాశం ఉంది.

ఇప్పుడు మరోసారి ఫుట్‌ఫాల్స్ పెంచాలంటే టికెట్ రేట్లు కూడా ఉపయోగపడొచ్చు. మూడు వారాలు పూర్తయిన సినిమాకు కొన్ని షోలు లేదా సెలెక్ట్ చేసిన థియేటర్లలో ధరలు తగ్గిస్తే ఇంకా చూడని ఫ్యామిలీస్‌కు పుష్ ఇచ్చినట్లు అవుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లో కుటుంబం మొత్తం వెళ్లినప్పుడు టికెట్లతో పాటు ఫుడ్, పార్కింగ్ ఖర్చు కూడా ఉంటుంది. అలాంటి చోట చిన్న తగ్గింపు కూడా నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంది.

అలాగే రిపీట్ ఆడియెన్స్. భక్తి టచ్ ఉన్న సినిమా కావడంతో వినాయక చవితి సమయంలో మళ్లీ చూడాలనుకునే వాళ్లు కూడా ఉండొచ్చు. పైగా సోమవారం సెలవు ఉండటం వల్ల ఆదివారంతో వీకెండ్ రన్ ఎండ్ అవ్వదు. శనివారం, ఆదివారం ఆక్యుపెన్సీ పెరిగితే సోమవారం కూడా థియేటర్లు షోలు అలాగే కొనసాగించే అవకాశం ఉంటుంది. కొత్త రిలీజ్‌ల మధ్య ఇది సినిమాకు ఉపయోగపడే చాన్స్. ఇంకా థియేటర్‌కు రాని ప్రేక్షకులను తీసుకురావడానికి ఈ నాలుగు రోజులు మంచి టైమ్. టీమ్ నిజంగా టికెట్ రేట్లపై ఏదైనా ఆఫర్ తీసుకొస్తుందా అనేది చూడాలి. అలా జరిగితే గణేష్ హాలీడే ముగిసే సమయానికి ఫుట్‌ఫాల్స్‌లో మరో జంప్ రావచ్చు.