రవితేజ 'ఇరుముడి'.. ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
By: M Prashanth | 27 Jan 2026 12:32 PM ISTటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. వరుస సినిమాలతో స్పీడ్ పెంచే రవితేజ.. ఈసారి ఒక కంప్లీట్ డిఫరెంట్ జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. రవితేజ 77వ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి పోస్టర్ రిలీజ్ వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో ఆసక్తిని కలిగిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో గట్టి చర్చ నడుస్తోంది.
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి 'ఇరుముడి' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పోస్టర్‌లో రవితేజ నల్లని దుస్తుల్లో, మెడలో మాల వేసుకుని అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటి భక్తితో కూడిన డ్రామాలో రవితేజను చూడటం ఫ్యాన్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తోంది. పోస్టర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఈ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.
దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా కోసం ఒక బలమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ.. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఈ 'ఇరుముడి' కథను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ ఒక చిన్న పాపను ఎత్తుకుని కనిపిస్తుండటం, చుట్టూ తోటి స్వాములు ఉండటం చూస్తుంటే.. కథలో అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉందని అర్థమవుతోంది. సాధారణ మాస్ సినిమాలకు భిన్నంగా రవితేజ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారనే ఫీలింగ్ ఆడియన్స్‌లో బలంగా కలిగింది.
ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. గతేడాది వరుస హిట్లతో దూసుకుపోతున్న జి.వి. ప్రకాష్ కుమార్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా ప్రారంభమై మొదటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. రవితేజ కెరీర్‌లో ఇదొక టాప్ హిట్ గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేటి జనరేషన్ ఆడియన్స్ ఎప్పుడూ ఇలాంటి కొత్తదనంతో కూడిన రియలిస్టిక్ కథల కోసం వెయిట్ చేస్తుంటారు. రవితేజ నుంచి వస్తున్న ఈ డిఫరెంట్ అటెంప్ట్ కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మేజిక్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం ఒక పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. రవితేజ తన కెరీర్‌లో ఇంతవరకు టచ్ చేయని ఈ కొత్త రూట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్రయోగం రవితేజకు ఎలాంటి సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి.
