సినిమాలకు ఐరెన్ లెగ్ లా ఆ నటి!
త్రివిక్రమ్ సినిమా డైలాగ్ లా కొంత మంది హీరోయిన్లకు అదృష్ణం ప్రంట్ పాకెట్ లో ఉంటే అదే పాకెట్ లో మరికొంత మందికి దురదృష్ణం ఉంటుంది.
By: Srikanth Kontham | 23 Jan 2026 8:00 PM ISTత్రివిక్రమ్ సినిమా డైలాగ్ లా కొంత మంది హీరోయిన్లకు అదృష్ణం ప్రంట్ పాకెట్ లో ఉంటే అదే పాకెట్ లో మరికొంత మందికి దురదృష్ణం ఉంటుంది. అలాంటి వాళ్లు ఎన్ని సినిమాల్లో నటించినా ఒకే రిజల్ట్ ఎదురవుతుంది.సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఓ అందమైన నటి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఓ ప్రయోగా త్మకం కావడంతో అనుకున్న ఫలితం రాలేదు. ప్రయోగం కావడంతో ఫలితం తేడాగా వచ్చింది. అందులో ఆ నటి తప్పేముంది అనుకున్నారంతా. ఆ తర్వాత నటించిన కమర్శియల్ చిత్రం కూడా అలాంటి రిజల్టే చూసింది.
అయినా ఓ స్టార్ డైరెక్టర్ రూపంలో మరో అవకాశం వచ్చింది. ఈసారి మాత్రం హిట్ తో అమ్మడు బాగానే సౌండ్ చేసింది. దీంతో కెరీర్ కి కొన్నాళ్లకు ఎలాంటి ఢోకా లేదనుకుంది. అదే సమయంలో కోలీవుడ్ లో కూడా ఛాన్స్ రావడంతో అక్కడా లాంచ్ అయింది. అనుకున్నట్లుగానే కెరీర్ ట్రాక్ లో పడుతున్నట్లే అనిపించింది. ఆ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాల్లో నటించింది. కానీ ఫలితాలే శూన్యం. ఎక్కడ కాలు పెడితే? అక్కడ విమర్శలు తప్ప ప్రశంసలకు దూరమైంది. దీంతో కెరీర్ పరంగా మూడేళ్లు గ్యాప్ వచ్చింది.
అయినా ఆ తర్వాత ఓ స్టార్ హీరో సరసన ఛాన్స్ అందుకోగలిగింది. ఇదే సమయంలో మరో సూపర్ హీరో సరసన ఛాన్స్ అందుకుంది. ఈసారి మాత్రం బౌన్స్ బ్యాక్ ఖాయమనుకున్నారంతా. ఇన్నాళ్లు ఒక లెక్క..ఇకపై మరో లెక్క అంటూ అమ్మడు సహా అమె అఫాలోవర్స్ కూడా చాలా నమ్మకంగా ఎదురు చూసారు. ఈసారి కూడా బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లు తప్పలేదు. గత ఏడాది ఓ ఫలితం నిరాశ పరిస్తే కొత్త ఏడాది మరో ప్లాప్ చిత్రం ఎదురైంది. కెరీర్ మొత్తంలో పది సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తే ఒక్క చిత్రం మాత్రమే విజయం సాధించింది. దీంతో అమ్మడిపై ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ పడిపోయింది.
పర భాషల్లోనైనా ఛాన్సులు అందుకుంటుందా? అంటే అక్కడా ఎలాంటి ప్రయత్నాలు చేసినట్లు కనిపించలేదు. తొలి సినిమా బాలీవుడ్ లోనే చేసింది. ఆ తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు. ఇక ప్రయత్నాలు చేయాల్సిన పరిశ్రమలు రెండే మిగిలి ఉన్నాయి. మాలీవుడ్, శాండిల్ వుడ్ లో అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకోవాలి.ఆ రెండు చిన్న పరిశ్రమలే. సక్సెస్ అయినా మళ్లీ ఇటువైపుగా అవకాశాలు కష్టం. ఒకసారి ఫేడౌట్ అయిన నటికి తెలుగులో మరో అవకాశం కష్టమే.
