నార్నే నితిన్ 5.. క్రేజీ పోస్టర్ లో ఎన్టీఆర్ కూడా ఇలా..
దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి ఈ సినిమాను పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. సినిమా అనౌన్స్మెంట్ కోసం డిజైన్ చేసిన పోస్టర్ ఐడియా నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి.
By: M Prashanth | 19 Jun 2026 10:32 AM ISTవరుస విజయాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నార్నే నితిన్. ప్రతి సినిమాలోనూ తనదైన నటనతో యూత్ కు బాగా కనెక్ట్ అవుతున్నాడు. లేటెస్ట్ గా తన కెరీర్ లో 5వ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట్ కే నారాయణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. యశ్, మెగాస్టార్ లాంటి హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు నార్నే నితిన్ తో చేతులు కలపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో జూనియర్ లాంటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి ఈ సినిమాను పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. సినిమా అనౌన్స్మెంట్ కోసం డిజైన్ చేసిన పోస్టర్ ఐడియా నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి. రెగ్యులర్ గా వచ్చే ఫస్ట్ లుక్ ఫార్మాట్ కు పూర్తి భిన్నంగా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లాగా దీన్ని క్రియేట్ చేశారు. నీలిరంగు ఆకాశం బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్ చూడగానే మంచి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది.
ఆ పోస్టర్ లో హీరో నితిన్ క్యాజువల్ డ్రెస్ లో ఒక గోడ మీద కూర్చుని చాలా రిలాక్స్డ్ గా కిందకు చూస్తున్నాడు. అతనికి ఎదురుగా ఎర్రటి డ్రెస్ లో ఉన్న ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. ఆమె కేవలం వెనక వైపు నుంచి మాత్రమే కనిపిస్తోంది. ఆమె తన చేత్తో ఇన్స్టాగ్రామ్ లోని హార్ట్ సింబల్ ను టచ్ చేస్తున్నట్లుగా పోస్టర్ ను డిజైన్ చేసిన తీరు భలేగా సెట్ అయింది.
ఈ క్యూట్ పోస్టర్ చూస్తేనే ఇది పక్కా రొమాంటిక్ లవ్ స్టోరీ అని మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఇందులో రాసిన క్యాప్షన్ కూడా నెటిజన్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. ఆకాశంలో ఉంటది మూను.. నువ్వే నా లైఫ్ కి క్వీను అంటూ రాసిన ఆ కొటేషన్ ఫన్నీగా ఉంది. దానికి తోడు వాడిన క్రేజీ హ్యాష్ ట్యాగ్స్ యూత్ కు కనెక్ట్ అవుతున్నాయి. ఇందులో కామెడీ, ఎమోషన్స్ గట్టిగానే ఉండబోతున్నాయని క్లారిటీ వచ్చేసింది.
ఈ పోస్టర్ లో మేకర్స్ వాడిన మరో మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే.. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పోస్ట్ ను లైక్ చేసినట్లుగా అందులో చూపించారు. లైక్డ్ బై జూనియర్ ఎన్టీఆర్ అని అక్కడ ప్రింట్ చేయడం ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తోంది. నార్నే నితిన్ కు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ గా వచ్చిన ఈ ప్రాజెక్ట్ లో నటించే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
