విరోష్ పెళ్లి ఫోటో కోసం దేశం ఎదురు చూపులు!
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫోటోలు బయటకు వస్తున్నప్పటికీ, అసలు పెళ్లి జంట అధికారిక ఫోటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
By: Sravani Lakshmi Srungarapu | 26 Feb 2026 5:43 PM ISTటాలీవుడ్‌లో ఎంతో కాలంగా చర్చనీయాంశంగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఎట్టకేలకు ఘనంగా జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ, ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం సైలెంట్‌గానే ఉంచింది. అంతేకాదు, ఎంగేజ్మెంట్ ను కూడా చాలా సీక్రెట్ గా జరిపేసుకుని, దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక అప్డేట్‌ను ఇవ్వలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న డైరెక్ట్ గా తమ పెళ్లి డేట్ ను ప్రకటిస్తూ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది విరోష్ జంట.
హల్దీ డెకరేషన్ ను షేర్ చేసిన జంట
వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో మూడు రోజులుగా జరుగుతున్న ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, కొద్దిమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌కే ఆహ్వానం పంపినట్టు సమాచారం. పెళ్లి వేడుక ప్రారంభానికి ముందు నుంచే విజయ్, రష్మిక జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో వేదిక ఏర్పాట్ల ఫోటోలు, హల్దీ వేడుక డెకరేషన్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అప్‌డేట్ చేస్తూ వచ్చారు. పూలతో అలంకరించిన హల్దీ సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
పెళ్లితో ఒక్కటైన విజయ్, రష్మిక
మొత్తమ్మీద ఇవాళ ఉదయం 10:10 గంటల శుభ ముహూర్తంలో విజయ్, రష్మికలు పెళ్లితో ఒక్కటయ్యారు. సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ వివాహానికి హాజరైన అతిథులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. పెళ్లికి వెళ్లిన గెస్టులు తీసుకున్న ఫోటోలు, కుటుంబ సభ్యులు క్లిక్ మనిపించిన క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అక్కడి మీడియా ప్రతినిధులకు కొత్త జంట స్వీట్ బాక్సులు కూడా పంపిణీ చేసినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫోటోలు బయటకు వస్తున్నప్పటికీ, అసలు పెళ్లి జంట అధికారిక ఫోటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటస్తాయనే ఉత్కంఠ ఇప్పుడందరిలోనూ నెలకొంది. తమ పెళ్లిని ప్రైవేట్ ఈవెంట్ గా నిర్వహించిన విరోష్ జంట, పెళ్లి ఫోటోలను స్పెషల్ గా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి విజయ్- రష్మిక తమ జీవితంలోని ఈ అత్యంత ప్రత్యేక క్షణాలను అభిమానులతో ఎప్పుడు పంచుకుంటారో చూడాలి. అప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న చిన్న చిన్న గ్లింప్సే అభిమానులకు తీపి జ్ఞాపకాలు.
