తెల్లవారుఝామున అలాంటి దృశ్యం చూపించిన నటుడు!
ఇటీవల సల్మాన్ ఖాన్ వరుసగా తన ప్రత్యర్థుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు.
By: Sivaji Kontham | 8 Oct 2025 5:00 AM ISTఇటీవల సల్మాన్ ఖాన్ వరుసగా తన ప్రత్యర్థుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. అతడి క్రమశిక్షణా రాహిత్యంపై చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో సల్మాన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే యువకథానాయకుడు రాఘవ్ జుయల్ సల్మాన్ ఖాన్ ఆతిథ్యం గురించి, పన్వేల్ ఫామ్ హౌస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఇందులో ఒక విచిత్రమైన అనుభవం కూడా రాఘవ్ జుయల్ కి ఎదురైంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రాత్రి వేళల్లో పార్టీలను అమితంగా ఇష్టపడతాడు. తెల్లవారుఝాము వరకూ ఫామ్ హౌస్ కి కునుకు అంటే ఏమిటో తెలీదు. అతడు సిటీ ఔటర్ లోని పన్వేల్ ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా గడుపుతాడు. అయితే ఈ ఫామ్ హౌస్ లో పార్టీకి వెళ్లిన యువనటుడు రాఘవ్ జుయెల్ కి వింతైన అనుభవాలే ఎదురయ్యాయి.
సల్మాన్ తన అతిథులను ఎంతో బాగా చూసుకుంటాడు. సకల సౌకర్యాలను కల్పిస్తాడు.. అయితే ఆరోజు సల్మాన్ ఖాన్ తెల్లవారుజామున 3 గంటలకు గుర్రాల సంభోగాన్ని చూడటానికి పార్టీకి వచ్చిన అందరినీ తీసుకెళ్లాడు. ఆ పార్టీకి `భయానకర్` అని పేరు పెట్టారు. ఆరోజు తెల్లవారు ఝామున చూసిన దృశ్యాన్ని తాను ఎప్పుడూ చూడలేదని కూడా రాఘవ్ అన్నాడు. సల్మాన్ ఫామ్‌హౌస్ లో చాలా సరదాగా ఉంటుంది. జలపాతాలు, పారే ఏటి నుంచి కూడా నడపగలిగే డర్ట్ బైక్‌లు అతడి వద్ద ఉన్నాయి. ఇది ఐదు నక్షత్రాల హోటల్ లో స్టే కంటే చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడ పార్టీలు రాత్రంతా జరుగుతాయి... ATVలు ఉదయం 4 గంటలకు బయటకు వస్తాయి. సల్మాన్ వాస్తవంలో జీవిస్తున్నాడు! అని రాఘవ్ అన్నారు.
సల్మాన్ ఫామ్ హౌస్ కి వెళ్లడం రాఘవ్ కి ఇదే మొదటిసారి కాదు. సల్మాన్‌కి అందరితో కలిసి కూర్చుని భోజనం చేసే అలవాటు ఉంది. అందరు నటులు అతనితో కలిసి ఒక టెంట్‌లో భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుందని రాఘవ్ జువల్ తెలిపాడు. నన్ను సల్మాన్ చాలాసార్లు తిట్టాడు.. కానీ మీ నాన్న లేదా అన్నయ్య తిట్టినట్టే ఉంది! అని చెప్పాడు.
సల్మాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో రాఘవ్ నటించాడు. ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ షో ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ కోసం కూడా పని చేసాడు.
