Begin typing your search above and press return to search.

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలోని ఆసక్తికర విషయాలను జర్నలిస్ట్ నమ్రతా జకారియా వెల్లడించారు. 200 మందికి ఆహ్వానం అనుకున్నా అతిథుల సంఖ్య 350 దాటిందని తెలిపారు. షారుఖ్ ఖాన్ వెనుక ద్వారం నుంచి రావడం, ఫొటోలు తీయడంపై ఆంక్షలు, సల్మాన్ ఖాన్‌కు ప్రత్యేక సోఫా కార్నర్ వంటి విషయాలు పార్టీ ప్రత్యేకతను చాటాయి.

By:  Srikanth Kontham   |   12 Nov 2026 5:00 PM IST
బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!
X

బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఏటా నిర్వహించే దీపావళి పార్టీకి పరిశ్రమలో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. మనీష్ ముంబై నివాసంలో జరిగిన గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు సంపన్న వ్యాపారవేత్తలు, 350 మందికి పైగా బాలీవుడ్ స్టార్స్ స‌హా మీడియా కెమెరాలు పెద్ద ఎత్తున సందడి చేసాయి. అయితే ఈ హై-ప్రొఫైల్ పార్టీ లోపల అస‌లేంజరుగుతుంది? తారలు ఎలా ప్రవర్తిస్తారు? అనే విషయాలపై ఓ ప్ర‌ముఖ జర్నలిస్ట్ నమ్రతా జకారియా ఆర్టికల్ రూపంలో ఎవరికీ తెలియని రహస్యాలను బయటపెట్టారు.

మనీష్ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ..బయట కనిపించే ఫోటోల వెనుక పెద్ద తంతే ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈసారి నివాసంలో 200 మందిని మాత్రమే ఆహ్వానించాలనుకున్నా? చివరికి అతిథుల సంఖ్య 350కి చేరింది. ఇంటి బయట వందలాది మంది కెమెరాలతో ఉండ‌గా.. లోపల మాత్రం బాలీవుడ్ ప్రముఖుల హడావుడి వేరే లెవెల్‌లో సాగింది. ముఖ్యంగా ఈ పార్టీలో స్టార్స్ అంతా ఎక్కడ కూర్చుంటారు? ఎవరి కార్నర్ ఏంటి? అనే విషయాలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ పార్టీలో క్యూరియాసిటీని రేకెత్తించే అంశం బాద్‌షా షారుఖ్ ఖాన్ ఎంట్రీ. షారుఖ్ ఎప్పుడూ ప్రధాన ప్రవేశ మార్గాల గుండా రాకుండా అత్యంత గోప్యంగా వెనుక ద్వారం గుండా లోపలికి వస్తారని నమ్రత వెల్లడించారు. పార్టీలో ఎవరైనా దూరం నుంచి షారుక్ ఫోటోలు తీస్తే షారుఖ్ పర్సనల్ బాడీగార్డ్ రవి సింగ్ వెంటనే వారి దగ్గరికి వెళ్లి ఆ ఫోటోలను డిలీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారట. ఒకవేళ ఎవరైనా నిబంధనలు మీరి పోస్ట్ చేస్తే? అటుపై మనీష్ మల్హోత్రా పార్టీకి వారికి మళ్లీ ఎప్పటికీ ఆహ్వానం ఉండ‌ద‌న్నారు.

పార్టీ జరిగే రెండో అంతస్తులోని డ్రాయింగ్ రూమ్‌లో ఉన్న వైట్ సోఫా కార్నర్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలుస్తుంది. సల్మాన్ ఖాన్ వస్తే ఈ కార్నర్‌లోనే ఎక్కువ సమయం గడుపుతారని.. ఆయన్ని పలకరించడానికి మిగతా నటీనటులు క్యూ కడతారని పేర్కొన్నారు. అలాగే ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఇదే ప్రాంతంలో కూర్చుంటారన్నారు. షారుఖ్-గౌరీ దంపతులు కూడా అక్కడే అతిథులను కలుసుకుంటారని తెలిపారు. ఎవరైనా కొత్తవారైతే షారుఖ్ ఎంతో ఆప్యాయంగా హగ్‌ ఇచ్చి చేయి ముద్దుపెట్టుకుని పలకరిస్తారన్నారు. కాకపోతే అక్కడ ఫోటోలు తీయడానికి మాత్రం ఎవరికీ అనుమతి ఉండదన్నారు.

బయట కనిపించే గ్లామర్ ప్రపంచానికి భిన్నంగా సెలబ్రిటీల వ్యక్తిగత నియమాలు, కట్టుబాట్ల మధ్య మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీ గోప్యంగా ముగిసింది. ఎంతోమంది స్టార్స్ ఒకే చోట క‌లిసినా? కొన్ని కఠినమైన రూల్స్ తో సెలబ్రేషన్స్ జరగడం బాలీవుడ్ వర్గాల్లో మ‌రోసారి చర్చనీయాంశంగా మారింది.