"ఊ అంటావా మావ" అంటూ ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
అయితే సడన్గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిస్తే మాత్రం.. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆరా తీస్తూ ఉంటారు.
By: Madhu Reddy | 30 Jan 2026 11:22 AM ISTఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు అడుగు పెడతారు. వారితో పాటు సింగర్స్ కూడా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒక్క సినిమాతో మంచి పాత్ర పడితే నటీనటులు ఎలా అయితే ఒక్క నైట్ లోనే పాపులారిటీ సంపాదించుకుంటారో ఇక సింగర్స్ కూడా అంతే. ఒక్క సాంగ్ వారి కెరియర్ నే మార్చేస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి నటీనటులు కానీ , సింగర్స్ కానీ ఏదో ఒక సమయంలో అభిమానుల నుంచి.. ఆ తర్వాత తెరమరుగవుతూ ఉంటారు. అయితే సడన్గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిస్తే మాత్రం.. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆరా తీస్తూ ఉంటారు.
అలాంటి వారిలో "ఉ అంటావా మావా.. ఉఊఅంటావా మావా" అనే పాట తో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఇంద్రావతి చౌహాన్ కూడా ఒకరు. ప్రముఖ జానపద గాయకురాలు.. సినిమా పాటల సింగర్ మంగ్లీ చెల్లిగా 'పుష్ప' సినిమాల్లో "ఉ అంటావా" అనే స్పెషల్ సాంగ్ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. హస్కీ వాయిస్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఒక్క పాటతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇంద్రావతి. ఆ తర్వాత తమిళ్లో వచ్చిన 'ఎంజాయ్' అనే చిత్రంలో "చెంగు చక్కెర కన్ను" అనే పాట పాడి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలా సినీ పాటలతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్న ఇంద్రావతి.. పెద్దగా ఆడియన్స్ దృష్టిలో పడలేదు.
ఇకపోతే అలాంటి ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎప్పుడూ సాంప్రదాయంగా కనిపించే ఇంద్రావతి సడన్గా గ్లామర్ లుక్ లో దర్శనమిచ్చేసరికి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు..
ఇక ప్రస్తుతం అమ్మడిని చూసిన తర్వాత ఇప్పుడు ఈమె ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. 2025లో విడుదలైన 'కుబేర' సినిమా నుండి "పిప్పి డుం డుం" అనే పాటతో పాటు ' బ్యాడ్ గర్ల్స్' సినిమాలోని "లేలియో" అనే పాట పాడారు. ఇక ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడ భాషలో పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన ఈమె.. అటు మలయాళ సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మలయాళం లో కూడా 'అంకం అట్టహాసం' అనే సినిమాలో ఒక పాట పాడి.. అక్కడ కూడా తన గాత్రంతో ప్రేక్షకులను అలరించింది. తన అక్కలాగే శివరాత్రి పాటలతో పాటు ప్రత్యేక ఆల్బమ్స్ ను అలాగే పాటలను విడుదల చేస్తూ బిజీగా మారింది.. ఇక ఇప్పుడు మహాశివరాత్రి దగ్గర్లో ఉన్న నేపథ్యంలో మరో ఆల్బమ్ సాంగ్ కోసం ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూసి అభిమానులు ఇప్పటికే సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇంద్రావతి కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి కాలం కలిసి వస్తే.. భవిష్యత్తులో ఇంద్రావతి కూడా హీరోయిన్గా అవతరిస్తుందేమో చూడాలి..
