ప్రేమలో చీటింగ్ తల్లి ప్రసవ వేదనతో సమానం!
యువతీ, యువకులు ప్రేమలో పడి మోసపోతున్న వైనం తెలిసిందే. ప్రేమ అనే మత్తులో జీవితాన్నే కోల్పోతున్నారు.
By: Srikanth Kontham | 6 Dec 2025 3:00 PM ISTయువతీ, యువకులు ప్రేమలో పడి మోసపోతున్న వైనం తెలిసిందే. ప్రేమ అనే మత్తులో జీవితాన్నే కోల్పోతున్నారు. కన్నవారిని వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నారు. మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిజమైన ప్రేమలో ఇవన్నీ ఉత్పన్నమవుతోన్న ప్రధాన కారణాలుగా ఓ సర్వేలో కూడా తేలింది. తాజాగా సీనియర్ నటి, హోస్ట్ ఇంద్రజ లవ్, బ్రేకప్ గురించి ఓ టాక్ షోలో స్పందించారు. కొంత మంది యువతీ, యువకులు ప్రేమ, బ్రేకప్ ను చాలా సులభంగా తీసు కుంటున్నారు. ఇలాంటి వాటిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నిచంగా
అలాంటి వారికి పుట్టగతులుండవ్:
బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కలిగే ప్రసవ వేదన ( బాధ) ఎంత తీవ్రంగా ఉంటుందో? ప్రేమలో మోసపోతే కలిగే బాధ కూడా అంతే స్థాయిలో ఉంటుందన్నారు. మోసానికి ఇక్కడ జెండర్ తో సంబంధం లేదు. ఆడ అయినా కావొచ్చు!మగ అయినా కావొచ్చు! ఎవరిదైనా మనసే. ఆ మనసును గాయ పరచడం అత్యంత పాపం. ఆ పెయిన్ భరించిన వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. అలా మోసం చేసి వెళ్లిపోయిన వారికి పుట్ట గతులుండవు. పుట్టింది ప్రేమించడానికి కాదు..సాధించడానికి యువత ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రేమ అనేది జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అన్నారు.
ఇష్టానికి మతం ..కులం తెలియవు:
ఇంద్రజ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమెది మతాంతర వివాహం. ఇంద్రజ హిందు బ్రహ్మాణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె భర్త ఒక ముస్లిం.పెళ్లికి ముందు ఆరు సంవత్సరాలపాటు స్నేహితులుగా కొనసాగారు. ఆ తర్వాతే వీరిమధ్య ప్రేమ చిగురించింది. అభిప్రాయాలు పంచుకున్నారు. ఒకరినొ కరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాతే వివాహ బంధంతో ఒకటయ్యారు. మీ పెళ్లికి మతం అడ్డు రాలేదా? అన్న ప్రశ్నకు గొప్ప సమాధానం ఇచ్చారు అప్పట్లో. ఇష్టం అనేది మతం, కులం చూసి కలగదు కదా..? మతానికి, మనసుకు నచ్చడానికి సంబంధం లేదు` అన్నారు. `తను నాకు అండగా ఉంటాడని నమ్మాను, ఆయ న కూడా అంతే.. అందుకే పెళ్లి చేసుకున్నాం` అన్నారు. ఇప్పుడా దంపతులకు ఓ పాప..బాబు కలరు.
ఎక్కడ అవకాశం వచ్చినా?
ప్రస్తుతం ఇంద్రజ కెరీర్ లో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. టెలివిజన్ కార్యక్రమాల్లో హోస్ట్ గా పని చేస్తు న్నారు. ఈవెంట్ లో ఎంతో హుందాగా వ్యవహ రించడం ఇంద్రజ ప్రత్యేకం. ఎన్ని కామెడీ షోలు చేసినా ఇంద్రజ మాత్రం ఏనాడు హద్దు మీరడం గానీ...డబుల్ మీనింగ్ డైలాగ్ లు వంటి వాటి జోలికి వెళ్లలేదు. అలా గే సినిమాల్లో నటిగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏభాషలో ఛాన్సులొచ్చినా పని చేస్తున్నారు.
