Begin typing your search above and press return to search.

ఐదు OTT యాప్‌ల‌పై ప్ర‌భుత్వ నిషేధం.. డొమైన్ పేరు మారితే క‌నిపెట్ట‌లేరా?

స‌మాచార ప్ర‌సారాల శాఖ ఇటీవ‌ల బూ*తు లేదా నీలి చిత్రాల యాప్ ల‌ను భీక‌రంగా స్క్రుటినీ చేస్తోంది.. చెత్త, బూ*తు, నీలి చిత్రాలు లేదా వీడియోలను అందించే ఓటీటీల‌ను పూర్తిగా నిషేధిస్తోంది.

By:  Sivaji Kontham   |   25 Feb 2026 10:02 AM IST
ఐదు OTT యాప్‌ల‌పై ప్ర‌భుత్వ నిషేధం.. డొమైన్ పేరు మారితే క‌నిపెట్ట‌లేరా?
X

స‌మాచార ప్ర‌సారాల శాఖ ఇటీవ‌ల బూ*తు లేదా నీలి చిత్రాల యాప్ ల‌ను భీక‌రంగా స్క్రుటినీ చేస్తోంది.. చెత్త, బూ*తు, నీలి చిత్రాలు లేదా వీడియోలను అందించే ఓటీటీల‌ను పూర్తిగా నిషేధిస్తోంది. గ‌తంలో కూడా ప్ర‌భుత్వం ప‌లు ఓటీటీల‌ను నిషేధించ‌గా ఇప్పుడు మ‌రో ఐదు ఓటీటీల‌ను నిషేధించడం సంచ‌ల‌నంగా మారింది.

ఇవి పిల్ల‌లు, యువ‌త‌రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నాయి. పెద్ద‌ల్ని కూడా త‌ప్పు దారి ప‌ట్టిస్తున్నాయి. గంట‌ల త‌ర‌బ‌డి విలువైన స‌మ‌యాన్ని కిల్ చేస్తున్నాయి. మెద‌డులో డోప‌మైన్ విడుద‌ల కాకుండా చేస్తున్నాయి...డిజిట‌ల్ కంటెంట్ రూల్స్ ని ఉల్లంఘిస్తున్న దుష్ట ఓటీటీలు రూపం మార్చుకుని కూడా ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నాయి. అందుకే చివ‌రికి అలా భార‌త‌ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. తాజా ప‌రిణామంతో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ల య‌జ‌మానులు నియ‌మాల‌ను తెలుసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ (ఎంఐబి) అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఐదు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై తాజాగా నిషేధం విధించింది. 24 ఫిబ్రవరి 2026న ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

డిజిటల్ కంటెంట్ నిబంధనలు -ఐటి రూల్స్ 2021 స‌హా అశ్లీలతకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఈ చర్యలు తీసుకున్నారు.

తాజాగా నిషేధించబడిన 5 ఓటీటీల వివ‌రాల్లోకి వెళితే.. మూడ్ ఎక్స్ వీఐపి, కోయల్ ప్లేప్రో, డిజి మూవీప్లెక్స్, అనుభూతి, జుగ్ను అనే ఐదు ఓటీటీల‌కు ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. ఈ ప్లాట్ ఫామ్ లు య‌థేచ్ఛ‌గా అర్థ‌న‌గ్న‌, శృంగార వీడియోల‌ను పోస్ట్ చేయ‌డం వ‌ల్ల‌నే నిషేధం అమ‌ల్లోకి వ‌చ్చింది. గ‌తంలో కూడా ఈ త‌ర‌హాలో కొన్ని ఓటీటీల‌ను ప్ర‌భుత్వం నిషేధించింది.

గతేడాది (2025) జూలైలో కూడా ప్రభుత్వం ఒకేసారి 25 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. ALTT (గతంలో ఆల్ట్ బాలాజీ), ఉల్లు, దేశిఫ్లిక్స్, బిగ్ షాట్స్ యాప్, బూమెక్స్, నియోన్ఎక్స్ విఐపి, కంగన్ యాప్, హాట్ఎక్స్ విఐపి, సోల్ టాకీస్, అడ్డా టీవీ వంటి వాటిని భార‌త ప్ర‌భుత్వం నిషేధించింది.

నిషేధానికి ప్రధాన కారణాలు:

ఎటువంటి కథాంశం లేకుండా కేవలం నగ్నత్వం, అసభ్యకరమైన సన్నివేశాలను చూపించడమే దీనికి కార‌ణం. అశ్లీల‌త విష‌యంలో నిబంధనల‌ను ఉల్లంఘించారు. ఐటీ రూల్స్ 2021 కింద సెక్షన్ 69ఏ ప్రకారం.. సామాజిక నైతికతకు విఘాతం కలిగించే కంటెంట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంది. పిల్ల‌లు, యువ‌త‌ను తప్పుదారి పట్టించే కంటెంట్ ని ఇవ్వ‌డం నేరం. దీనిపై గతంలో హెచ్చరించినా కానీ కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు తమ కంటెంట్‌ను మార్చుకోకుండా డొమైన్ పేర్లు మార్చి మళ్లీ అదే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ఐఎస్‌.పిలు) ఈ వెబ్‌సైట్‌లు, యాప్‌లను వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.