Begin typing your search above and press return to search.

వేడెక్కిస్తోన్న సినిమాటిక్ యూనివ‌ర్శ్!

లోకేష్ క‌న‌గ‌రాజ్ `ఖైదీ`తో సినిమాటిక్ యూనివ‌ర్శ్ అనే ప‌దం వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   9 Sept 2025 5:00 PM IST
వేడెక్కిస్తోన్న సినిమాటిక్ యూనివ‌ర్శ్!
X

లోకేష్ క‌న‌గ‌రాజ్ `ఖైదీ`తో సినిమాటిక్ యూనివ‌ర్శ్ అనే ప‌దం వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. `ఖైదీ` విజ‌యం అనంత‌రం 'విక్ర‌మ్', 'లియో' లాంటి సినిమాలు అదే యూనివ‌ర్శ్ నుంచి రావ‌డంతో సినిమాటిక్ యూనివ‌ర్శ్ అనేది ట్రెండింగ్ గా మారింది. అటుపై ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా 'హనుమాన్' విజ‌యం తో త‌న‌కంటూ ఓ యూనివ‌ర్శ్ ను క్రియేట్ చేసుకోవ‌డంతో? పాన్ ఇండియా వైడ్ మ‌రింత సంచ‌ల నంగా మారింది. లోకేష్ తొలుత కార్తీతో `ఖైదీ` ని మొద‌లు పెట్టి అటుపై అదే యూనివ‌ర్శ్ లోకి అగ్ర తార‌ల‌ను తెరపైకి తీసుకురావ‌డం మొద‌లు పెట్టాడు. విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో `విక్ర‌మ్` ,అటుపై ద‌ళ‌ప‌తి విజ‌య్ తో `లియో` చిత్రాలు చేయ‌డం సంచ‌ల నంగా మారింది.

మ‌రో అరేళ్లు అదే దూకుడు:

ఇప్పుడు అదే యూనివ‌ర్శ్ నుంచి `ఖైదీ 2` రాబోతుంది. ఇందులో హీరోగా కార్తీ న‌టిస్తు న్నాడు? అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న అధికారిక స‌మాచారం. ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కేలోపు మ‌రింత మంది బిగ్ స్టార్స్ యాడ్ అయ్యే అవ‌కాశం ఉంది. `రోలెక్స్` త‌ర‌హాలో త‌న యూనివ‌ర్శ్ లో స్టార్ల‌ను ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ఉంద‌న్న‌ది తాజా స‌మాచారం. మ‌రో ఆరేళ్ల పాటు అదే యూనివ‌ర్శ్ నుంచి త‌న సినిమాల‌న్నీ రిలీజ్ అవుతాయ‌ని ప్ర‌క‌టించ‌డంతో? అంతకంత‌కు అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి. దీంతో పాటు `రోలెక్స్` టైటిల్ తో సూర్య‌తో మ‌రో సినిమా కూడా చేస్తున్నాడు.

మార్కెట్ లో యూనివ‌ర్శ్ వేడి:

టాలీవుడ్ డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను కూడా ఇలాంటి యూనివ‌ర్శ్ నుంచే వ‌రుస‌గా క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రాలు చేస్తున్నాడు. తొలుత యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ తో `హిట్` చేసాడు. అటుపై `హిట్ 2`ని అడ‌వి శేష్ తో చేసాడు. అనంత‌రం `హిట్ 3` లో ఏకంగా నేచుర‌ల్ స్టార్ నానినే భాగం చేసాడు. ఇక `హిట్ 4`ని కార్తీతో తీస్తున్న‌ట్లు ఇప్పటికే ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. అలాగే ప్ర‌శాంత్ వ‌ర్మ తేజ స‌జ్జా అనే యంగ్ హీరోతో `హ‌నుమాన్` తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడ‌దే యూనివ‌ర్శ్ నుంచి `జై హ‌నుమాన్` చిత్రాన్ని క‌న్న‌డ స్టార్ రిష‌బ్ శెట్టితో చేస్తు న్నాడు. ఇందులో అగ్ర తారాలు కూడా భాగ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్న‌ది తాజా స‌మాచారం.

భ‌విష్య‌తో అవెంజ‌ర్స్ త‌ర‌హాలో:

అలాగే మాలీవుడ్ నుంచి ఇటీవ‌ల రిలీజ్ అయిన `లోకాచాప్ట‌ర్ 1` మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మెయిన్ లీడ్ ప్రియ‌ద‌ర్శిని పోషించింది. చాలా చిన్నగా మొద‌లైన ప్రాజెక్ట్ లోకి ప్పుడు ఏకంగా మాలీవుడ్ మెగాస్టారే రంగంలోకి దిగుతున్నారు. రెండ‌వ భాగంలో మ‌మ్ముట్టి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. చిన్నగా మొద‌లైన యూనివ‌ర్శ్ ల‌న్నీ ఇలా స్టార్ హీరోల ఎంట్రీతో బిగ్ స్కేల్ లోకి మారుతున్నాయి. భ‌విష్య‌త్ లో ఇదే యూనివ‌ర్శ్ లో న‌టించిన స్టార్లు అంద‌ర్నీ ఒకే తాటిపైకి వ‌చ్చి హాలీవుడ్ అవెంజ‌ర్స్ త‌ర‌హాలో మ‌రో పెద్ద ప్రాజెక్ట్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు.