Begin typing your search above and press return to search.

వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధమా..?

ఈ సినిమాలతో కచ్చితంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ షేక్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Ramesh Boddu   |   28 July 2025 1:50 PM IST
వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధమా..?
X

భారతీయ సినిమా ప్రస్తుతం వరల్డ్ సినిమాకు ధీటుగా మూవీస్ చేస్తుంది. కళ్లు చెదిరే అద్భుతాలు.. విజువల్ గ్రాండియర్ మన దగ్గర చేస్తున్నారు. ఇదివరకు హాలీవుడ్ సినిమాలు చూసి మనం సినిమాలు చేసే వాళ్లం. కానీ ఇప్పుడు అక్కడ వాళ్లు మన ఇండియన్ సినిమాలను.. కథలను రిఫరెన్స్ గా తీసుకుని సినిమాలు చేసే రేంజ్ కి ఎదిగాం. ఇప్పటికే హాలీవుడ్ సినిమాల రేంజ్ కి ఇండియన్ సినిమాలు ప్రభావం చూపిస్తున్నాయి. రాబోతున్న మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ కూడా వరల్డ్ వైడ్ గా సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ సినిమాలతో కచ్చితంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ షేక్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోతున్న క్రేజీ కాంబినేషన్స్ వాటి మేనియా ఏంటన్నది ఒకసారి చూద్దాం.

హాలీవుడ్ కి ధీటుగా..

పాన్ ఇండియాగా వస్తున్న రామాయణ్ సినిమా.. ఈమధ్యనే టీజర్ తో సర్ ప్రైజ్ చేసింది. విజువల్స్ పరంగా హాలీవుడ్ కి ధీటుగా ఈ సినిమా ఉండబోతుందని శాంపిల్ చూస్తేనే అర్థమవుతుంది. నితీష్ తివారి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సినీ ప్రియుల మనసులు గెలిచేలా ఉంది.

ఇక నెక్స్ట్ రాజమౌళి మూవీ SSMB 29. ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆల్రెడీ హాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడ్డ రాజమౌళి ఈ సినిమాను వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు. మహేష్, రాజమౌళి కలిసి మొదటిసారి చేస్తున్న ఈ సినిమా సెన్సేషన్ అనిపించుకోవాలని చూస్తుంది. ఈ మూవీతో జక్కన్న వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయాలని చూస్తున్నాడు.

పుష్ప తో అదరగొట్టిన అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీతో ఒక అదిరిపోయే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిజంగానే హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ లో ఒకటిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అట్లీ మాత్రం ఈ సినిమా సినీ లవర్స్ కి మర్చిపోలేని విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు.

ఎన్టీఆర్ తో త్రివిక్రం మైథాలజీ

ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ తో త్రివిక్రం చేస్తున్న మైథాలజీ సినిమా కూడా టాప్ రేంజ్ లో ఉండబోతుంది. ఈ సినిమా విషయంలో త్రివిక్రం ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందట. తన కెరీర్ లో గురూజీ తొలిసారి ఒక భారీ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ మిగతా అంతా కూడా ఎవరి ఊహలకు అందవని అంటున్నారు.

సందీప్ వంగ యానిమల్ తర్వాత చేస్తున్న సినిమా స్పిరిట్. ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ కి అదే రేంజ్ ఫోర్స్ ఉన్న డైరెక్టర్ దొరికితే ఎలా ఉంటుందో స్పిరిట్ తో తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా గురించి కూడా వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.





వరల్డ్ సినీ లవర్స్ టార్గెట్..

వీటితో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ తో ఒక సూపర్ హీరో సినిమా అనుకుంటున్నారు. ఈ సినిమా కూడా హాలీవుడ్ రేంజ్ కి తగినట్టే ఉంటుందట. తప్పకుండా సినిమా విజువల్ గ్రాండియర్ గా ఆడియన్స్ కి ఒక నెవర్ బిఫోర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా భారతీయ సినిమా వరల్డ్ సినీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు వస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో తమ సత్తా చాటబోతున్నాయి. తప్పకుండా ఈ సినిమాలతో ఇండియన్ సినిమా వైడ్ రేంజ్ బ్లాస్టింగ్ ఉంటుందని చెప్పొచ్చు.