లక్షల్లో జీతం.. లగ్జరీ లైఫ్.. ఆశ్చర్యపరుస్తున్న స్టార్స్ బాడీగార్డ్స్ రేంజ్!
సినిమా స్టార్లు కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడతారు. అలాంటి సమయాల్లో తమ హీరోలను కంటికి రెప్పలా కాపాడేవారే ఈ బాడీగార్డ్స్.
By: Madhu Reddy | 8 Jun 2026 12:45 PM ISTసినిమా స్టార్లు కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడతారు. అలాంటి సమయాల్లో తమ హీరోలను కంటికి రెప్పలా కాపాడేవారే ఈ బాడీగార్డ్స్. అయితే మన స్టార్ హీరోలు తమ ప్రాణాలను కాపాడే ఈ బాడీగార్డ్స్‌కు ఇచ్చే జీతాలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. పెద్ద పెద్ద ఉద్యోగులు, సీఈఓలకు కూడా లేని రేంజ్‌లో వీరికి నెల నెలా లక్షల్లో జీతాలు అందుతుంటాయి. మన దేశంలో అత్యధిక జీతం తీసుకునే ఆ సెలబ్రిటీ బాడీగార్డ్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్ బాడీగార్డ్ టాప్ రికార్డ్:
ఈ లిస్టులో అందరినీ ఆశ్చర్యపరుస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాడీగార్డ్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఇక చరణ్ బాడీగార్డ్ 'కెవిన్' నెలకు ఏకంగా 20 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, పెద్ద బిజినెస్‌మెన్ కూడా కావడం వల్లే తన బాడీగార్డ్‌కు ఇండియాలోనే అత్యధిక సాలరీ ఇస్తున్నారట. ఈ జీతం దేశంలోని చాలా మంది స్టార్ హీరోల బాడీగార్డ్స్ కంటే చాలా ఎక్కువ.
బాలీవుడ్ ఖాన్స్ జోరు:
బాలీవుడ్ స్టార్ల బాడీగార్డ్స్ జీతాలు కూడా గట్టిగానే ఉన్నాయి. అమీర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ ఘోర్పడే, సల్మాన్ ఖాన్‌కు నీడలా ఉండే షేరా.. ఒక్కొక్కరు 16 లక్షల రూపాయలు నెల జీతంగా అందుకుంటున్నారు. అలాగే అక్షయ్ కుమార్ బాడీగార్డ్ శ్రేయస్ థేలేకు రూ.14 లక్షలు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ రక్షణ చూసుకునే జితేంద్ర షిండేకు రూ.13 లక్షలు, షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవిసింగ్‌కు నెలకు 12 లక్షల రూపాయల సాలరీ అందుతోంది.
సౌత్ స్టార్ల రక్షణ ఖర్చు:
సౌత్ హీరోల విషయానికి వస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాడీగార్డ్ రమేష్ చెరుకు నెలకు 12 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఇక తమిళ స్టార్ దళపతి విజయ్ బాడీగార్డ్ నయీమ్ మూసా రూ.13 లక్షలు, కేజీఎఫ్ స్టార్ యష్ బాడీగార్డ్ శ్రీనివాస్ నెలకు 9 లక్షల రూపాయల జీతం పొందుతున్నారు. అయితే మన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి మరికొందరు టాప్ స్టార్లు మాత్రం పర్సనల్ బాడీగార్డ్స్‌ను ఉంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరని టాక్.
హీరోయిన్ల బాడీగార్డ్స్ తక్కువ తిన్లేదు:
కేవలం హీరోలే కాదు, టాప్ హీరోయిన్లు కూడా తమ బాడీగార్డ్స్‌కు భారీగానే ఇచ్చుకుంటున్నారు. దీపికా పదుకొణె తన బాడీగార్డ్ జలాల్‌కు నెలకు 10 లక్షల రూపాయలు ఇస్తుండగా, హృతిక్ రోషన్ బాడీగార్డ్ మయూర్ శెట్టికి రూ.7 లక్షలు, ఆలియా భట్ బాడీగార్డ్ యూసుఫ్‌కు రూ.7 లక్షలు, కత్రినా కైఫ్ రక్షణ చూసే దీపక్ సింగ్‌కు నెలకు 6 లక్షల రూపాయల జీతం లభిస్తోంది.
సెలబ్రిటీల లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుందో, వారిని కాపాడే బాడీగార్డ్స్ లైఫ్ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది. నిరంతరం కెమెరాల నిఘాలో, వేల మంది జనం మధ్య స్టార్స్ ప్రాణాలకు రక్షణగా నిలవడం అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే ఈ బాడీగార్డ్స్ పడే కష్టానికి, రిస్క్‌కు తగ్గట్టే మన స్టార్లు కూడా వారికి లక్షల్లో జీతాలు ఇస్తూ రాచమర్యాదలు చేస్తున్నారు.
