Begin typing your search above and press return to search.

100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు.. ఇండియాలో ఫస్ట్ కొట్టిన హీరోలు వీరే..

భారతీయ సినిమాల రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు 100 కోట్లు అంటేనే చాలా పెద్ద విషయంగా ఉండేది, కానీ ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్ అనేది ఒక మామూలు అంకెలా మారిపోయింది.

By:  M Prashanth   |   3 April 2026 9:03 AM IST
100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు.. ఇండియాలో ఫస్ట్ కొట్టిన హీరోలు వీరే..
X

భారతీయ సినిమాల రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు 100 కోట్లు అంటేనే చాలా పెద్ద విషయంగా ఉండేది, కానీ ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్ అనేది ఒక మామూలు అంకెలా మారిపోయింది. ఈ ప్రయాణంలో ప్రతి వంద కోట్ల మార్కును ఒక హీరో తన సినిమాతో మొదలుపెట్టి హిస్టరీ క్రియేట్ చేశారు. ముఖ్యంగా సౌత్ సినిమాల హవా పెరిగిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల లెక్కలు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతోంది. రజనీకాంత్ నుంచి అల్లు అర్జున్ వరకు ప్రతి ఒక్కరూ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను సెట్ చేసిన వారే.

సినిమా ఫలితం అనేది కేవలం హిట్ లేదా ఫ్లాప్ అనే దానితోనే కాకుండా, అది ఎంతవరకు వసూళ్లు రాబట్టింది అనే దానిపైనే ట్రేడ్ వర్గాల దృష్టి ఉంటుంది. దేశవ్యాప్తంగా నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే, ఒక్కో వంద కోట్ల మార్కును టచ్ చేసిన మొదటి సినిమాలు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. ఆయా హీరోల మార్కెట్ వాల్యూని ఇవి అమాంతం పెంచేశాయి. రజనీకాంత్ తో మొదలైన ఈ రికార్డుల వేటలో అమీర్ ఖాన్ తన సత్తా చాటగా, ప్రభాస్ బాహుబలితో ఏకంగా బాలీవుడ్ కోటలను బద్దలు కొట్టి వరుసగా కొత్త రికార్డులను స్థాపించారు.

అల్ ఇండియా నెట్ కలెక్షన్స్ లో కొత్త చరిత్ర సృష్టించిన ఆ హీరోలు, సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రజనీకాంత్ ‘శివాజీ’తో 100 కోట్ల క్లబ్ ను ప్రారంభించగా, ఆ తర్వాత అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలతో ఆ మార్కును 300 కోట్లకు తీసుకెళ్లారు. అయితే ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్ తో బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా ‘బాహుబలి 2’ సినిమాతో 400 కోట్ల నుంచి మొదలుపెట్టి ఏకంగా 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ వరకు ప్రతి క్లబ్ రికార్డును తానే స్వయంగా బ్రేక్ చేయడం విశేషం.

ఈ రికార్డుల జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక గుర్తింపుని అందుకున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా 1100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్కును దాటి కొత్త రికార్డును సృష్టించారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆప్పటివరకు ఏ సినిమా కూడా టచ్ చేయని ఈ స్థాయి వసూళ్లను సాధించి అల్లు అర్జున్ తన పవర్ చూపించారు. ప్రభాస్ సృష్టించిన వెయ్యి కోట్ల రికార్డును దాటి మరీ అల్లు అర్జున్ ఒక కొత్త క్లబ్ ను స్థాపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇండియన్ బాక్సాఫీస్ నెట్ క్లబ్ లిస్ట్

100 కోట్లు: రజనీకాంత్ (శివాజీ)

200 కోట్లు: అమీర్ ఖాన్ (3 ఇడియట్స్)

300 కోట్లు: అమీర్ ఖాన్ (పీకే)

400 కోట్లు: ప్రభాస్ (బాహుబలి)

500 కోట్లు: ప్రభాస్ (బాహుబలి 2)

600 కోట్లు: ప్రభాస్ (బాహుబలి 2)

700 కోట్లు: ప్రభాస్ (బాహుబలి 2)

800 కోట్లు: ప్రభాస్ (బాహుబలి 2)

900 కోట్లు: ప్రభాస్ (బాహుబలి 2)

1000 కోట్లు: ప్రభాస్ (బాహుబలి 2)

1100 కోట్లు: అల్లు అర్జున్ (పుష్ప 2)

ఇక ధూరందర్ సినిమా ఇటివల భారీ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 1300 కోట్లను దాటినా ఇండియాలో నెట్ కలెక్షన్స్ లో లెక్క 1000 కోట్లు దాటలేదు. ఆ మార్క్ కు దగ్గరలోనే ఉంది. ఇక 1200 కోట్ల మార్కును అందుకుంటే మళ్ళీ న్యూ రికార్డు అవుతుంది. కానీ సాధ్యం కాకపోవచ్చు. ఇక నెక్స్ట్ రాజమౌళి వారణాసి ఇండియాలో 1500 కోట్ల నెట్ కలెక్షన్స్ బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుందేమో చూడాలి. మున్ముందు మరిన్ని పెద్ద సినిమాలు రాబోతున్నాయి కాబట్టి, ఈ రికార్డులను ఇంకెవరు తిరగరాస్తారో చూడాలి.