Begin typing your search above and press return to search.

కోట్ల ఖర్చు… అంచనాలు పీక్‌లో.. ఈ సినిమాలు హిట్ అవుతాయా?

భారతీయ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ పౌరాణిక విజువల్ వండర్ కోసం మేకర్స్ ఏకంగా రూ.

By:  Madhu Reddy   |   20 Jun 2026 8:00 PM IST
కోట్ల ఖర్చు… అంచనాలు పీక్‌లో.. ఈ సినిమాలు హిట్ అవుతాయా?
X

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు బడ్జెట్ల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వందల కోట్లు కాదు, ఏకంగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో మన స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు పాన్-ఇండియా, గ్లోబల్ లెవెల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ 'రామాయణ' నుండి మహేశ్ బాబు-రాజమౌళిల ప్రాజెక్ట్ వరకు.. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాలు, వాటిపై ట్రేడ్ వర్గాల్లో ఉన్న అంచనాలు, బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 2200 కోట్ల ‘రామాయణ’.. రణ్‌బీర్ కపూర్ క్రేజ్:

భారతీయ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ పౌరాణిక విజువల్ వండర్ కోసం మేకర్స్ ఏకంగా రూ. 2200 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇక రామాయణం కాన్సెప్ట్ అంటేనే ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది కాబట్టి దీనిపై మంచి బజ్ ఉంది. ఇక ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్ దాదాపు రూ. 1400 నుండి 1500 కోట్లు రాబట్టి హిట్ లేదా సూపర్ హిట్ రేంజ్‌లో నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

రాజమౌళి-మహేశ్ బాబుల రూ.1300 కోట్ల ‘వారణాసి’:

ఇక బాహుబలి, RRR చిత్రాలతో గ్లోబల్ లెవెల్లో సౌండ్ చేసిన లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి చేస్తున్న అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ఇక ఈ క్రేజీ కాంబో సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1300 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజమౌళి బ్రాండ్, మహేశ్ బాబు క్రేజ్ కలవడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 1500 నుండి 1700 కోట్ల లాంగ్ రన్ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ లేదా అల్టిమేట్ ‘బ్లాక్‌బస్టర్’ కావడం ఖాయమని విశ్లేషకులు నమ్ముతున్నారు.

అల్లు అర్జున్-అట్లీల రూ. 800 కోట్ల ‘రాకా’:

ఇక పుష్ప సినిమాతో గ్లోబల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జవాన్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా' మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై యావరేజ్ టు గుడ్ బజ్ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్ రూ. 600 నుండి 700 కోట్లు దాటితే హిట్ లేదా బ్లాక్‌బస్టర్ స్టేటస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది.

ప్రభాస్-నాగ్ అశ్విన్‌ల రూ.700 కోట్ల ‘కల్కి 2’:

ఇక మొదటి భాగంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ ‘కల్కి 2’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పార్ట్-2 కోసం దాదాపు రూ. 700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక మొదటి పార్ట్ ఇచ్చిన సాలిడ్ సక్సెస్‌తో ఈ సీక్వెల్‌పై ఎక్స్‌ట్రార్డినరీ అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో ఈ సినిమా రూ. 1200 నుండి 1300 కోట్ల రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించి మరో సంచలన ‘బ్లాక్‌బస్టర్’గా నిలుస్తుందని అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు.

వందల, వేల కోట్ల భారీ బడ్జెట్లతో రూపొందుతున్న ఈ సినిమాలు భారతీయ మార్కెట్‌ను దాటి, మన మేకింగ్ స్టాండర్డ్స్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఇక భారీ ఖర్చుతో పాటు అంచనాలు పీక్స్‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో, ఏ ఏ సినిమాలు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాయో చూడాలి.