Begin typing your search above and press return to search.

'ఇండియ‌న్ 3' కి ముహూర్తం పెట్టారా?

`ఇండియ‌న్ 2` దెబ్బ‌తో `ఇండియ‌న్ 3` ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయిందో తెలిసిందే. ఇండియ‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన సినిమా అయినా? జ‌నాలు లైట్ తీసుకునే ప‌రిస్థితికి వ‌చ్చేసింది.

By:  Srikanth Kontham   |   9 March 2026 10:22 AM IST
ఇండియ‌న్ 3 కి ముహూర్తం పెట్టారా?
X

`ఇండియ‌న్ 2` దెబ్బ‌తో `ఇండియ‌న్ 3` ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయిందో తెలిసిందే. ఇండియ‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన సినిమా అయినా? జ‌నాలు లైట్ తీసుకునే ప‌రిస్థితికి వ‌చ్చేసింది. శంక‌ర్ పనైపోయింది. ఇంకేం సినిమాలు చేస్తాడులే అన్న విమ‌ర్శ‌లు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో `ఇండియ‌న్ 3` రిలీజ్ అవుతుందా? లేదా? అన్న ఎన్నో సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఒక‌వేళ రిలీజ్ అయినా థియేట్రిక‌ల్ గా రిలీజ్ అవుతుందా? ఓటీటీలో రిలీజ్ అవుతుందా? అన్న సందేహం న‌డుమ థియేట‌ర్లోనే రిలీజ్ చేస్తామ‌ని క్లారిటీ ఇచ్చారు.

ఇక రిలీజ్ విష‌యంలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. గ‌త ఏడాదే రిలీజ్ అవుతుంద‌ని భావించారు. కానీ సాధ్య‌ప‌డ‌లేదు. మ‌రి ఈ ఏడాదైనా సినిమా రిలీజ్ అవుతుందా? అంటే ఆగ‌స్టులో రిలీజ్ కు ముహూర్తం పెట్టిన‌ట్లు నిర్మాణ వ‌ర్గాల నుంచి తెలిసింది. ఆగ‌స్టు ప‌దవ తేదీ లేదా? 15 త‌ర్వాత రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారుట‌. స్వాతంత్య్ర దినోత్స‌వాన్నిపుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు 15న `పౌజీ` పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో `ఇండియ‌న్ 3` ని ఆ తేదీకి రిలీజ్ చేయ‌డం భావ్యం కాద‌ని భావించి త‌ర్వాత తేదీల్ని ప‌రిశీలిస్తున్నారు.

`ఇండియ‌న్ 3` కి ఉన్న బ‌జ్ కి పోటీగా రిలీజ్ అయితే వ‌సూళ్లు మ‌రింత బ‌ల‌హీనంగా ఉండే అవ‌కాశం ఉంటుంది. ఇవ‌న్నీ ఆలోచించుకునే లేదా? 15 తర్వాత ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వం ఎప్పుడో జ‌రిగిందో ఓ సారి పాత విష‌యాల్లోకి వెళ్తే... `ఇండియన్ 3` చిత్రానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రారంభ తేదీ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే `ఇండియన్ 2 `, `ఇండియన్ 3` రెండింటినీ దర్శకుడు శంకర్ ఒకేసారి చిత్రీకరించారు. `ఇండియన్ 2` షూటింగ్ 2019 జనవరి 18న ప్రారంభమైంది. కోవిడ్ ,ఇతర కారణాల వల్ల షూటింగ్ కి బ్రేక్ ప‌డింది.

2022లో షూటింగ్ పునఃప్రారంభమైంది. అప్పుడే శంకర్ వద్ద ఉన్న పుటేజ్, కథ నిడివి పెరగడంతో దాన్ని రెండు భాగాలుగా అంటే ఇండియ‌న్ 2, ఇండియ‌న్ 3 గా డివైడ్ చేసారు. 2024 మార్చి కే `ఇండియన్ 3` షూటింగ్ 80-90 శాతం పూర్త‌యింది. కానీ రీ షూట్, ప్యాచ్ వ‌ర్క్ ఉండ‌టంతో 2025-26 లో మూడవ భాగంలో శంక‌ర్ కొన్ని మార్పులు చేసారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో నిర్మాణ సంస్థ‌ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా ఈ ఏడాది సినిమా రిలీజ్ చేయాల‌ని సీరియ‌స్ గానే వ‌ర్క్ చేస్తోంది.