ఇండియన్ 3 : మంచి అవకాశం మిస్ అయ్యింది!
యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో అప్పట్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 8 Oct 2026 11:02 AM ISTయూనివర్శల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో అప్పట్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తమిళ్‌లో రూపొంది తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారతీయుడు సినిమాను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని పదుల కొద్ది సినిమాలు అన్ని భాషల్లో వచ్చాయి. ఆ సినిమా సన్నివేశాలు వందల సినిమాల్లో వినియోగించడం జరిగింది. అంతటి గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాకు సీక్వెల్ అంటే అదే స్థాయిలో అంచనాలు ఉంటాయి. కానీ ఇండియన్ 2 సినిమాతో దర్శకుడు శంకర్ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాడు. సినిమాపై వచ్చిన అంచనాల్లో కనీసం 1% సైతం అందుకోలేక పోవడంతో పాటు, తీవ్రమైన ట్రోల్స్ ను చవిచూడాల్సి వచ్చింది. కమల్ హాసన్ ను అలా చూపడం ఏంటని కొందరు, అదేం కథ అని మరికొందరు ఎవరికి తోచిన విధంగా వారు ఓ రేంజ్‌లో ఏసుకున్నారు.
ఇండియన్ 3 సినిమా విడుదల...
ఇండియన్ 2 సినిమా సమయంలోనే ఇండియన్ 3 సినిమాను సైతం షూట్ చేశారు. మొదట సింగిల్ పార్ట్ అనుకున్నప్పటికీ రెండు పార్ట్‌లుగా సినిమాను తీయాల్సి వచ్చింది. లెంగ్త్ ఎక్కువ కావడంతో రెండు పార్ట్‌లుగా మార్చారా లేదంటే బిజినెస్ కోసం రెండు పార్ట్‌లుగా చేశారా అనేది మాత్రం క్లారిటీ లేదు. మొదటి పార్ట్‌కు వచ్చిన మంచి స్పందన నేపథ్యంలో రెండో పార్ట్ ను పెద్ద ఎత్తున విడుదల చేశారు. కానీ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఇండియన్ 2 చివర్లో మూడో పార్ట్ కి సంబంధించిన క్లిప్స్ వేయడంతో పాటు, ట్రైలర్ ను చూపించారు. దాంతో రెండో పార్ట్ కంటే మూడో పార్ట్‌లో కథ ఎక్కువ ఉండబోతుందని, అంతే కాకుండా మొత్తం సినిమా మూడో పార్ట్‌లోనే ఉంటుందని చెప్పినట్లు అయింది. మేకర్స్ సైతం కచ్చితంగా మూడో పార్ట్ ఆకట్టుకుంటుందని హైప్ క్రియేట్ చేశారు. ఇండియన్ 2 విడుదలైన సమయంలో ఇండియన్ 3 గురించి ప్రముఖంగా చర్చ జరిగింది.
కమల్ హాసన్ ఫ్యాన్స్‌తో పాటు...
ఇండియన్ 3 సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇండియన్ 2 వచ్చిన ఆరు నెలల లోపు ఇండియన్ 3 వచ్చి ఉంటే కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యేవి. సినిమా ఎలా ఉన్నా మినిమం వసూళ్లు నమోదు అయ్యేవి. కానీ ఇప్పుడు సినిమా గురించి అంతా మర్చి పోయారు. ఇండియన్ 2 గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇండియన్ 3 సినిమాను విడుదల చేస్తాం అంటే ప్రేక్షకులు మాత్రమే కాకుండా కమల్ హాసన్ అభిమానులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన చివరి మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే ఇండియన్ 3 సినిమా పూర్తి బజ్ కోల్పోయింది. ఇప్పుడు విడుదల చేసినా పెద్దగా ఫలితం ఉండదు అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు, మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు ఇండియన్ మూవీకి సంబంధించి ఏ విషయాన్ని వినాలి, చూడాలి అనుకోవడం లేదని సోషల్ మీడియా ట్రెండ్.
ఓటీటీలో ఇండియన్ 3 సినిమా...
ప్రతి సినిమాకు ఒక టైం వస్తుంది. ఆ టైమ్‌లో విడుదల చేస్తే కచ్చితంగా ఫలితంతో సంబంధం లేకుండా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. కానీ సినిమా గురించి లో బజ్ ఉన్న సమయంలో విడుదల చేస్తే కనీసం ఓపెనింగ్స్ కూడా రావు. ఇప్పుడు ఇండియన్ 3 సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ నుంచి కదలిక కనిపిస్తోంది. త్వరలోనే బిగ్ అప్‌డేట్ ఉంటుంది అన్నట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటన కనిపించింది. ఆ మధ్య సినిమాను డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమ్ చేసినా మంచి స్పందన దక్కి ఉండేది. అప్పుడు సినిమాను విడుదల చేయకపోవడం అనేది పెద్ద తప్పు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచి అవకాశంను మిస్ చేసుకున్న ఇండియన్ 3 మేకర్స్ ఇప్పుడు వచ్చి ఎంత పబ్లిసిటీ చేసినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా సూపర్ డూపర్ అన్నట్లుగా ఉంటే తప్ప వసూళ్లు వచ్చే అవకాశం లేదు. ఒక వేళ డైరెక్ట్ ఓటీటీ అయితే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావాల్సి ఉంది. అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.
