Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో మరో బిగ్ డెబ్యూ ప్లాన్

ఉదయనిధి ఫిల్మ్ కెరీర్‌కు 'మామన్నన్' మూవీ ఒక పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ గిఫ్ట్ ఇచ్చింది.

By:  M Prashanth   |   9 Oct 2025 10:13 AM IST
కోలీవుడ్ లో మరో బిగ్ డెబ్యూ ప్లాన్
X

​తమిళనాడులో పొలిటికల్ పవర్‌తో పాటు సినీ గ్లామర్ కూడా కలగలిసిన ఫ్యామిలీ నుంచి ఒక బిగ్ డెబ్యూకి రంగం సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ఉదయనిధి స్టాలిన్ హీరోగా గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి, పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టిన ఇతను, తన లాస్ట్ ఫిల్మ్‌తో డీసెంట్ సక్సెస్‌ను చూశాడు. అయితే, ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఇంకొకరు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

​ఉదయనిధి ఫిల్మ్ కెరీర్‌కు 'మామన్నన్' మూవీ ఒక పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ సినిమా అందించిన డైరెక్టర్‌కే ఇప్పుడు ఉదయనిధి తనయుడి బాధ్యతలను అప్పగించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి బజ్ వినిపిస్తోంది. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. బ్లాక్ బస్టర్ మేకింగ్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారి సెల్వరాజ్.

మరోవైపు, సెల్వరాజ్ ప్రస్తుతం ధృవ్ విక్రమ్తో తీసిన 'బైసన్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ​ఇక, అసలు విషయానికి వస్తే.. ఉదయనిధి స్టాలిన్ కొడుకు ఇన్బనితి ఉదయనిధి త్వరలో హీరోగా తన డెబ్యూని గ్రాండ్‌గా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసే ఛాన్స్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ దక్కించుకున్నాడని తమిళ మీడియా అంటోంది.

పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ ఇచ్చిన దర్శకుడికే ఇప్పుడు లాంచింగ్ బాధ్యత కూడా అప్పగించడం ఒక పక్కా ప్లాన్ అని చెప్పొచ్చు. ​రీసెంట్‌గా ఇన్బనితి ఒక బిగ్ డెసిషన్ తీసుకుని, ఏకంగా ఫేమస్ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు CEOగా బాధ్యతలు తీసుకున్నాడు. సినీ మేకింగ్ గురించి అంతర్గతంగా నేర్చుకోవాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన కావచ్చు.

2004లో పుట్టిన ఇన్బనితికి మరొక ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. ఇతను ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ కూడా. గతంలో NEROCA FC టీమ్‌కు మిడ్‌ఫీల్డర్‌గా ఆడి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. ​రాజకీయ వారసత్వం, సినిమా ప్రొడక్షన్ కంపెనీకి CEO పదవి, అథ్లెటిక్ బ్యాక్‌గ్రౌండ్... ఇన్ని యాంగిల్స్ ఉన్న ఒక యువకుడు ఇప్పుడు హీరోగా వస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పైగా, తండ్రి లాస్ట్ సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన డైరెక్టర్‌తోనే డెబ్యూ అవుతున్నాడు కాబట్టి, ఆ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మామూలుగా ఉండవు. ​మొత్తానికి, ఇన్బనితి ఉదయనిధి డెబ్యూ ప్లాన్ కచ్చితంగా ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ మెగా డెబ్యూ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వస్తుందని టాక్.