దిశాపటానీకి చుక్కలే.. సీరియల్ కిస్సర్ ఘాటు ముద్దుల ఎటాక్!
బాలీవుడ్‌లో ఒకే సినిమాలో అరడజను లేదా అంతకంటే ఎక్కువ సార్లు కిస్ సీన్లు చేసిన హీరోల జాబితాలో ఇమ్రాన్ హష్మీ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు.
By: Sivaji Kontham | 5 March 2026 8:30 AM ISTబాలీవుడ్ తెరపై ఘాటైన రొమాన్స్, సీరియల్ ముద్దులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఇమ్రాన్ హష్మీ మరోసారి తన పాత రూట్లోకి వస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది.
బాలీవుడ్ సీరియల్ కిస్సర్ గా ముద్ర వేయించుకున్న ఇమ్రాన్ హష్మీ గత కొంతకాలంగా తన ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రొమాంటిక్ హీరో పాత్రల కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ ఓజి (OG)లో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ బాలీవుడ్ కిస్సర్ ఇమేజ్‌కు దూరంగా జరుగుతున్నారని అందరూ అనుకున్నారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇమ్రాన్ మళ్ళీ తన మార్కు రొమాన్స్‌తో వెండితెరను హీటెక్కించబోతున్నారు. ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయిన `అవారాపణ్` సినిమాకు ఇప్పుడు సీక్వెల్ `అవారాపణ్ 2` సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ తన పాత సీరియల్ కిస్సర్ ఇమేజ్‌కు న్యాయం చేస్తూ మరోసారి చెలరేగిపోనున్నారట. గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాలో రొమాన్స్ డోస్ మునుపటి కంటే ఎక్కువే ఉంటుందని టాక్.
ఈ సీక్వెల్‌లో ఇమ్రాన్ సరసన గ్లామరస్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఇమ్రాన్ - దిశాల మధ్య ఏకంగా ఆరు నుండి ఎనిమిది సార్లు లిప్ లాక్ సన్నివేశాలు ఉండబోతున్నాయట. తెరపై అరడజనుకు పైగా ముద్దు సీన్లతో ఇమ్రాన్ తన రికార్డును తానే తిరగరాయబోతున్నారు. ఇది విన్న నెటిజన్లు సరదాగా బహుశా టైగర్ ష్రాఫ్ కూడా దిశాను అన్నిసార్లు కిస్ చేసి ఉండడు ఏమో! అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇమ్రాన్ ఎప్పుడూ నంబర్ వన్..
బాలీవుడ్‌లో ఒకే సినిమాలో అరడజను లేదా అంతకంటే ఎక్కువ సార్లు కిస్ సీన్లు చేసిన హీరోల జాబితాలో ఇమ్రాన్ హష్మీ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు. గతంలో మర్డర్, ఆషిక్ బనాయా ఆప్నే వంటి సినిమాల్లో ఆయన రికార్డ్ స్థాయి ముద్దు సీన్లతో సంచలనం సృష్టించారు. ఆయన తర్వాత రణబీర్ కపూర్ (రాక్ స్టార్, ఏ దిల్ హై ముష్కిల్), రణవీర్ సింగ్ (బేఫికర్) వంటి హీరోలు కూడా తెరపై ఘాటైన ముద్దు సీన్లతో, రొమాంటిక్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా `బేఫికర్` సినిమాలో రణవీర్ - వాణీ కపూర్ మధ్య లెక్కలేనన్ని కిస్ సీన్లు ఉన్న సంగతి తెలిసిందే.
సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో కిస్ సీన్లు కామన్ అయినా కానీ.. ఇమ్రాన్ హష్మీ రొమాన్స్‌కు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. హీరోయిన్లతో బెడ్‌రూమ్ రొమాన్స్ అయినా.. ఘాఢమైన ముద్దులైనా ఆయన ఆ పాత్రల్లో జీవిస్తారనే పేరుంది. అందుకే ఆయనను ఇప్పటికీ బాలీవుడ్ అసలైన సీరియల్ కిస్సర్‌గా అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు దిశా పటానీతో అతడి ముద్దు సీన్లు కేక పెట్టిస్తాయని అంచనాలున్నాయి.
ఈ మార్పు ఇమ్రాన్ కెరీర్‌కు మళ్ళీ కొత్త ఊపిరి పోస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవైపు సౌత్ సినిమాల్లో విలన్‌గా రాణిస్తూనే.. మరోవైపు బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా అలరించడం ఇమ్రాన్ హష్మీకే సాధ్యమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. `అవారాపణ్ 2` చిత్రంతో ఆయన మళ్ళీ సీరియల్ కిస్సింగ్ లో రారాజుగా నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది.
నో కిస్సింగ్ పాలసీకి బ్రేక్!
ఇమ్రాన్ హష్మీ గత కొన్ని ఏళ్లుగా తన సినిమాల్లో ముద్దు సీన్లు తగ్గించుకుంటూ వచ్చారు. వ్యక్తిగతంగా ఆయన `నో కిస్సింగ్ పాలసీ పాటిస్తున్నారని.. కేవలం స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్ప అటువంటి సన్నివేశాల్లో నటించనని గతంలో ప్రకటించారు. అందుకే ఆయన తాజా చిత్రాల్లో రొమాన్స్ కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తూ వచ్చింది.
అయితే `అవారాపణ్ 2` కోసం ఆయన తన సొంత నిబంధనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం మరియు పాత్రల మధ్య ఉండే తీవ్రమైన ప్రేమను పండించడానికి ముద్దు సీన్లు అనివార్యమని దర్శకుడు కోరడంతో ఇమ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
