Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీ లో రచయితలు లేరా? వాళ్ళను చంపేసింది ఎవరు?

ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే కథ బాగుండాలి. సినిమాలో ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నా లేకపోయినా సినిమాలో స్టోరీ ఉంటేనే మూవీ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది.

By:  Tupaki Entertainment Desk   |   22 Sept 2026 1:29 PM IST
ఇండస్ట్రీ లో రచయితలు లేరా? వాళ్ళను చంపేసింది ఎవరు?
X

ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే కథ బాగుండాలి. సినిమాలో ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నా లేకపోయినా సినిమాలో స్టోరీ ఉంటేనే మూవీ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది. దర్శకుడు మేకింగ్ విషయంలో కొంతవరకు తడబడిన కూడా కథ ఎంగేజ్ చేయగలిగితే మాత్రం సక్సెస్ ని సాధిస్తుందనేది వాస్తవం. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మన స్టార్ డైరెక్టర్లు గొప్ప కథలను సినిమాలుగా తెరకెక్కిస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు రాఘవేంద్రరావు లాంటి దర్శకుడు తన దగ్గర కొంతమంది రైటర్లను పెట్టుకొని కథలను రాయించుకొని సినిమాలు చేసేవాడు. అందువల్ల అతనికి సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండేది. ఈ రోజుల్లో ప్రతి డైరెక్టర్ తన కథను తానే రాసుకుంటున్నాడు. దానివల్ల తనకు నచ్చిన కథను రాసుకొని నచ్చినట్టుగా తెరకెక్కిస్తున్నాడు. అది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే హిట్ అవుతుంది లేకపోతే ఫట్ అవుతుంది. అందువల్ల సక్సెస్ పర్సంటేజ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఏది ఏమైనా కూడా కథ రచయిత అనే వారు సపరేట్ గా ఉన్నప్పుడు ఒక కథని చాలా పకడ్బందీగా రాసుకోగలరు. దానిని దర్శకుడు ఓన్ చేసుకొని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ మధ్య ఇండస్ట్రీ లో కథ రచయితలు కనబడకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రచయితలకు జరుగుతున్న అవమానం అంటూ కొంతమంది రైటర్స్ బయటికి వచ్చి బహిరంగంగా చెబుతున్నారు. చాలామంది రచయితలు దర్శకులుగా మారడానికి వాళ్లకు సరైన రెస్పెక్ట్ లభించకపోవడమే అంటూ మరికొంతమంది చెబుతున్నారు.

కొంతమంది స్టార్ డైరెక్టర్లు రచయితల కథలను వాడుకొని వాళ్లకు సరైన గుర్తింపును ఇవ్వకుండా టైటిల్స్ కార్డ్స్ లో సైతం వాళ్ళ పేరు లేకుండా చేస్తున్నారు. అందువల్లే రచయితగా ఉండడానికి ఏ ఒక్కరు ఇష్టపడడం లేదు. రైటర్ ను గౌరవించుకోలేని వాళ్లు సినిమాలను ఏం చేస్తారు అంటూ ప్రశ్నించే విమర్శకులు కూడా ఉన్నారు. ఒక కథ రచయిత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి కథను అందించినప్పుడు సినిమా ఆటోమేటిగ్గా సక్సెస్ అవుతుంది. తద్వారా ప్రేక్షకులందరు ఆ కథకి అట్రాక్ట్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. రచయితలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ మీదనే ఉంది.

ఎందుకని వాళ్ళను చంపేస్తున్నారు వీలైతే వాళ్ళను కాపాడండి అంటూ చాలామంది చాలా రకాల కామెంట్స్ చేసిన కూడా అది ప్రాక్టికల్ గా వర్కౌట్ కావడం లేదు. కొంతమంది మాటల రచయితలుగా ఉన్నప్పటికి ఫుల్ ఫ్లెడ్జుడ్ కథ రచయితలు మాత్రం ఎవరు లేరు. ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్, యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాల, త్రివిక్రమ్ లాంటివారు గొప్ప కథలను అందించారు... ఇక ఇప్పుడు రాజమౌళి చేసే సినిమాలకు వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ సపరేట్ కథ రచయితగా వ్యవహరిస్తున్నాడు తప్ప మిగిలిన దర్శకులందరు వాళ్ళ కథను వాళ్లే రాసుకుంటున్నారు...