OTTల సైలెన్స్.. ఇది కదా కావాల్సింది..!
ఇక నాని ది ప్యారడైజ్, చిరంజీవి విశ్వంభర సినిమాలు కూడా సమ్మర్ రిలీజ్ లాక్ చేసుకున్నాయి. వీటితో పాటు వరుణ్ తేజ్, నిఖిల్ లాంటి యువ హీరోల సినిమాలు ఈ సమ్మర్ కి సందడి చేయబోతున్నాయి.
By: Ramesh Boddu | 26 Jan 2026 12:02 PM ISTఈమధ్య స్టార్ సినిమాల మీద ఓటీటీల ప్రెజర్ తెలిసిందే. మీడియం బడ్జెట్ సినిమాల నుంచి స్టార్ సినిమాల వరకు రిలీజ్ ఎప్పుడన్నది ఓటీటీల చేతుల్లో ఉంటున్నాయి. ముఖ్యంగా రిలీజ్ డేట్ లు ఓటీటీలు చెప్పిన టైం కే చేసే పరిస్థితి వచ్చింది. సినిమా కాంబినేషన్ కి తగిన బడ్జెట్ కోసం ఓటీటీల తో ముందే డీల్ సెట్ చేసుకోవడం వల్ల వాళ్లు చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని సినిమాలు ఆ ప్రెజర్ కి సినిమా అవుట్ ని కూడా సరిగా తీయలేని విధంగా పరిస్థితి ఏర్పడింది.
సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ డీల్స్..
ఐతే ఓటీటీలు కూడా ఇదివరకులా కాంబినేషన్ చూసి భారీ ధరకు సినిమాలు కొనకుండా థియేట్రికల్ రన్ ని బట్టి డీల్ సెట్ చేసుకుంటున్నాయి. అంటే సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ డీల్స్ జరుగుతున్నాయన్నమాట. స్టార్ సినిమాలకు ఓటీటీ సంస్థలు పోటీ పడి డీల్ సెట్ చేసుకుంటున్నా అవి కూడా రిలీజ్ ఎప్పుడన్నది మేకర్స్ ఇష్టం అనే కండీషన్ మీదే రైట్స్ కొనేస్తున్నాయి.
ఈ సమ్మర్ కి స్టార్ సినిమాల హంగామా ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఓటీటీ సంస్థలు కూడా సమ్మర్ సినిమాల కోసం మంచి ప్రైజ్ సెట్ చేసుకుంటున్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్, మే ఇలా సమ్మర్ 3 నెలలు సినిమాలకు ఓటీటీ ప్రెజర్ లేనట్టే అనిపిస్తుంది. స్టార్ కాంబినేషన్స్ ఇంకా సరైన కథ కథనాలతోనే ఈ సినిమాలు వస్తున్నాయి. మార్చి ఎండింగ్ లో పెద్ది రిలీజ్ అవుతుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మార్చి రేసులో ఉంటుందని టాక్.
ఓటీటీ రిలీజ్ లపై నిర్మాతల కండీషన్..
ఇక నాని ది ప్యారడైజ్, చిరంజీవి విశ్వంభర సినిమాలు కూడా సమ్మర్ రిలీజ్ లాక్ చేసుకున్నాయి. వీటితో పాటు వరుణ్ తేజ్, నిఖిల్ లాంటి యువ హీరోల సినిమాలు ఈ సమ్మర్ కి సందడి చేయబోతున్నాయి. ఐతే ఓటీటీ రిలీజ్ లపై ఇదివరకే నిర్మాతలు ఒక కండీషన్ పెట్టగా దాన్ని ఎవరు పాటించలేదు. అంతేకాదు స్టార్ సినిమాలకు ఓటీటీ డీల్స్ భారీగా జరగడం అవి ప్రొడక్షన్ కి ఉపయోగపడటం వల్ల ఓటీటీ సంస్థలు ఎలా చెబితే మేకర్స్ అలా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐతే ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా సినిమా రైట్స్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి కాబట్టి నిర్మాతలు తాము చెప్పినట్టుగా ఓటీటీ రిలీజ్ అదే డిజిటల్ రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ రిలీజ్ అంటే సినిమా ఫలితాలు ఎలా ఉన్నా వాటికి ఒక నెల రెండు నెలలు టైం తీసుకుని ఓటీటీ రిలీజ్ లు అవుతాయి. ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారు కాబట్టి ఓటీటీ రిలీజ్ ఎంత లేట్ అయితే అంత ఫుట్ ఫాల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
