'ఇమ్మొర్టల్' మూవీ ట్రైలర్ రివ్యూ... ఆ ఒక్కటి మిస్ అయిందిగా...
ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే జీవి ప్రకాష్ కుమార్ ఒక రూమ్ కోసం వెతుకుతూ ఉంటాడు.
By: Tupaki Entertainment Desk | 15 Sept 2026 11:29 AM ISTఈ మధ్య కాలం లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లందరు హీరోలుగా మారిపోతున్నారు. రెండు దశాబ్దాల పాటు కుర్రాళ్లను తన బాణీలతో అలరించిన దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారి 'ఎల్లమ్మ' అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన సత్తా చాటుకున్న జీవి ప్రకాష్ కుమార్ సైతం హీరోగా మారి పలు సినిమాలు చేసి సక్సెస్ లను సాధించాడు. నిజానికి ఒక మూవీ సక్సెస్ లో మ్యూజిక్ కీలక పాత్ర వహిస్తుంది. ప్రేక్షకుడు స్క్రీన్ మీద విజువల్ చూస్తున్నప్పుడు ఆ సీన్ లోని ఇంటెన్సిటీని పూర్తిస్థాయిలో ఆడియన్ ఎంజాయ్ చేయాలంటే బ్యా గ్రౌండ్ స్కోర్ అత్యద్భుతంగా ఉండాలి. అప్పుడే సినిమాలోని హై ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. తద్వారా సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు సంగీత దర్శకుల వల్లే సక్సెస్ అయ్యాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...ఇక మొత్తానికి హీరోగా మారిన జీవి ప్రకాష్ కుమార్ రొటీన్ రొట్ట ఫార్ములా మూవీస్ కి పూర్తి భిన్నంగా సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం 'ఇమ్మొర్టల్' అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. 'మరియప్ప చిన్న' దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.
ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే జీవి ప్రకాష్ కుమార్ ఒక రూమ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కాయద్ లోహర్ తనకు కాల్ చేసి లివింగ్ షేర్ రూమ్ లో ఉండడం మీకు ఇష్టమేనా అని అడిగి అతన్ని తనతో పాటు ఆమె రూమ్ లోనే ఉంచుకుంటుంది. ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ఆ రూమ్ లో ఆమె జీవి ప్రకాష్ ను ఎందుకని తన రూమ్మేట్ గా చేర్చుకుంది. అసలు ఆమెకి తనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే ఒక క్యూరియాసిటీని రికెత్తించే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కినట్టుగా తెలుస్తుంది. ట్రైలర్ లో అరుణ్ రాధాకృష్ణనన్ అందించిన విజువల్స్ టాప్ నాచ్ లో ఉన్నాయి. జీవి ప్రకాష్ కుమార్ ట్రైలర్ లో తన డీసెంట్ యాక్టింగ్ ని చూపిస్తూ ఆ క్యారెక్టర్ ను పర్ఫెక్ట్ గా పట్టుకున్నాడు. కయద్ లోహర్ సైతం పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించినట్టుగా తెలుస్తుంది. కథలో వైవిధ్యం ఉంది కాబట్టే జీవి ప్రకాష్ కుమార్ దీనిని ఓకే చేశాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇమ్మొర్టల్ అంటే అమరత్వం కలిగిన వ్యక్తి. ఒకరకంగా మరణం లేని వ్యక్తిగా మనం భావించవచ్చు. సినిమాలో మరణం లేని వ్యక్తి ఎవరు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు. దానికి జస్టిఫికేషన్ ఎలా ఇవ్వబోతున్నారు. ట్రైలర్ లో జీవి ప్రకాష్ క్యారెక్టర్ లోని షేడ్స్ ఏంటి అనేది మనకు పూర్తిస్థాయిలో చూపించకపోయిన కూడా సినిమా ఏ జోనర్ లో సాగుతుందనే విషయంలో ఒక హింట్ ఇచ్చారు.
మొత్తానికైతే సినిమాలో ట్విస్టు లు కూడా చాలానే ఉండబోతున్నాయనే విషయం మనకు ట్రైలర్ ని చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది...డైరెక్టర్ మరియప్ప చిన్న కథని చాలా మెచ్యుర్డ్ గా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ మూవీ అడ్వెంచర్ జానర్ లో నడుస్తూనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సైతం ఇందులో పుష్కలంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సిజి వర్క్ విషయానికి వస్తే ట్రైలర్లో కొన్నిచోట్ల సీజీ అంత పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టుగా అనిపించలేదు.
కొన్ని చోట్ల మిస్ ఫైర్ అయింది. శ్యామ్ సిఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకే అనిపించింది. ఈ మధ్యకాలంలో శ్యామ్ సిఎస్ చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ లను సాధించకపోవడం, అలాగే తన మ్యూజిక్ కి ప్రశంశలు రాకపోవడం తో ఆయన ఎలాగైనా సరే ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది. సినిమా రిలీజైతే కానీ కాన్సెప్ట్ లో ఉన్న డెప్త్ ఏంటి? ఏ క్రాఫ్ట్ వారు ఎలా వర్క్ చేశారు అనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు...
