Begin typing your search above and press return to search.

IMDb టాప్‌ మూవీస్‌ : పాతికేళ్లలో బాహుబలి, పుష్ప మాత్రమే..!

ఇంటర్నెట్‌లో సినిమాలకు రేటింగ్‌ ఇచ్చే ప్లాట్‌ ఫామ్స్ ఎన్నో ఉన్నా IMDb చాలా ప్రత్యేకమైనది అనడంలో సందేహం లేదు.

By:  Ramesh Palla   |   1 Oct 2025 11:55 AM IST
IMDb టాప్‌ మూవీస్‌ : పాతికేళ్లలో బాహుబలి, పుష్ప మాత్రమే..!
X

ఇంటర్నెట్‌లో సినిమాలకు రేటింగ్‌ ఇచ్చే ప్లాట్‌ ఫామ్స్ ఎన్నో ఉన్నా IMDb చాలా ప్రత్యేకమైనది అనడంలో సందేహం లేదు. వారి సొంత రివ్యూలు కాకుండా యూజర్స్‌, ప్రేక్షకుల అభిప్రాయాలు, వారి రేటింగ్‌ను చూపించడం ద్వారా జెన్యూన్‌ రేటింగ్‌ లభిస్తుందని అంతా భావిస్తూ ఉంటారు. అందుకే IMDb నుంచి ఏదైనా జాబితా వచ్చినా, సర్వే ఫలితాలు వచ్చినా చాలా ఎక్కువ జెన్యూన్‌గా ఉండే అవకాశం ఉంటుందని జాతీయ మీడియా సంస్థలు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇండియన్ సినిమాలకు సంబంధించిన టాప్‌ మూవీస్ జాబితాలను మాత్రమే కాకుండా హాలీవుడ్‌తో పాటు, అన్ని విదేశీ భాషలకు సంబంధించిన సినిమాల డేటాబేస్‌ను సదరు ఆన్‌లైన్‌ పోర్టల్‌ భద్రపర్చడం మనం చూడవచ్చు. సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా విషయాలను IMDb ఇస్తుంది.

తాజాగా IMDb నుంచి ఇండియాలో గత పాతికేళ్లలో విడుదలైన టాప్‌ చిత్రాల జాబితా వచ్చింది. 2000 సంవత్సరం నుంచి మొదలుకుని ఈ ఏడాది వరకు విడులైన టాప్‌ చిత్రాల జాబితాను IMDb రిలీజ్ చేసింది. అందులో ప్రతి ఏడాదికి 5 సినిమాల చొప్పున 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం 130 టాప్‌ చిత్రాలను ఈ జాబితాలో ఇవ్వడం జరిగింది. ప్రతి ఏడాదిలో విడుదలైన సినిమాల జాబితాలోంచి బిగ్‌ కమర్షియల్‌ మూవీస్‌ను నెం.1 స్థానంలో చేర్చడం జరిగింది. 250 మిలియన్‌ల యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ జాబితాను చేసినట్లుగా చెబుతున్నారు. ఈ జాబితాలో నెం.1 స్థానంలో తెలుగు సినిమాలు నాలుగు చోటు దక్కించుకున్నాయి. అవి బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2 సినిమాలు కావడం విశేషం. ఇక కన్నడ నుంచి కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్ 2 సైతం ఆయా సంవత్సరాల్లో నెం.1 స్థానంలో నిలిచాయి.

సంవత్సరాల వారిగా నెం.1 స్థానంలో నిలిచిన సినిమాలు ఇవే..

2000 - మొహబ్బతే

2001 - కభీ ఖుష్‌ కభీ ఘమ్‌

2002 - దేవ్‌దాస్‌

2003 - కల్‌ హో నా హో

2004 - వీర్‌ జారా

2005 - బ్లాక్‌

2006 - ధూమ్‌ 2

2007 - తారే జమీన్‌ పర్‌

2008 - రబ్‌ నే బనాదీ జోడీ

2009 - 3 ఇడియట్స్

2010 - మై నేమ్‌ ఈజ్ ఖాన్‌

2011 - జిందగీ న మిలేగా దుబారా

2012 - గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్‌

2013 - ది లంచ్ బాక్స్‌

2014 - పీకే

2015 - బాహుబలి 1

2016 - దంగల్‌

2017 - బాహుబలి 2

2018 - కేజీఎఫ్‌ 1

2019 - ఉరి : ది సర్జికల్‌ స్ట్రైక్‌

2020 - దిల్‌ బెచారా

2021 - పుష్ప 1

2022 - కేజీఎఫ్‌ 2

2023 - యానిమల్‌

2024 - పుష్ప 2

2025 - సయ్యారా

నెం.1 స్థానంలో నిలిచిన నాలుగు తెలుగు సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలు సైతం ఆయా సంవత్సరాలలో 2, 3, 4, 5 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. వాటిల్లో ముఖ్యంగా మగధీర, ఆర్‌ఆర్‌ఆర్‌, సలార్‌ 1, అలవైకుంఠపురంలో, అర్జున్‌ రెడ్డి, నేనొక్కడినే సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాలు గత పదేళ్లుగా ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ పై సత్తా చాటుతున్నాయి. బాహుబలితో ఆరంభం అయిన ఈ జర్నీ కొనసాగుతూనే ఉంది. రాబోయే పాతికేళ్లలో టాలీవుడ్‌ ఆధిపత్యం మరింత ఎక్కువ కావాలని, అలాగే సౌత్‌ సినిమాలు సత్తా చాటాలని అంతా కోరుకుంటున్నారు.