సౌత్ సినిమా స్థాయిని పెంచిన హీరోయిన్స్..
2025వ సంవత్సరానికి గానూ దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరించిన ఎంతోమంది కథానాయకలు తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
By: Madhu Reddy | 20 Dec 2025 7:00 PM IST2025వ సంవత్సరానికి గానూ దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరించిన ఎంతోమంది కథానాయకలు తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినిమాలు, టీవీ షోలు ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని విశ్లేషించి అందించే వేదిక IMDb. ఇక 2025వ సంవత్సరానికి గానూ అత్యంత ప్రజాదారణ పొందిన భారతీయ సినీ నటీమణుల జాబితాను తాజాగా విడుదల చేయగా.. ఇందులో టాప్ 10లో మన సౌత్ హీరోయిన్స్ కూడా చోటు దక్కించుకోవడం గర్వకారణం అని చెప్పాలి.
ఇకపోతే ఈ ఏడాది తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించి.. ఈ ఏడాది అత్యంత ప్రజాదారణ పొందిన నటీమణుల విషయానికి వస్తే.. టాప్ 10లో రష్మిక మందన్న 6వ స్థానం, కల్యాణి ప్రియదర్శన్ 7వ స్థానం, రుక్మిణి వసంత్ 9వ స్థానాలను దక్కించుకున్నారు. విషయంలోకి వెళ్తే రష్మిక మందన్న వరుస పెట్టి సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 చిత్రాలతో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ ఛావా, యానిమల్, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, థామా ఇలా వరుస పెట్టి సినిమాలు చేసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ చిత్రాల ద్వారా ఈ ఏడాది అత్యంత ప్రజాధారణ పొందిన హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ ఏడాది అత్యధిక ప్రజాదారణ పొందిన నటీమణులలో టాప్ టెన్ లో స్థానం సంపాదించుకున్న మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె తొలిసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అందరిని ఆశ్చర్యపరిచింది. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా సూపర్ హీరో పాత్రలు చేయగలరు అని నిరూపించింది కళ్యాణి ప్రియదర్శన్. లోకా చాప్టర్ చంద్ర అనే మలయాళ సినిమాను కొత్తలోక అంటూ తెలుగులో రిలీజ్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది కళ్యాణి ప్రియదర్శన్.
ఇక ఈ జాబితాలోకి చేరిన మరో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ . గత ఏడాది అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఈ ఏడాది మదరాసి అనే తమిళ్ చిత్రంలో నటించింది. శివ కార్తికేయన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార చాప్టర్ 1 చంద్ర సినిమాలో యువరాణి పాత్రలో నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.
అలా ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత ప్రజాదారణ కలిగిన హీరోయిన్స్ జాబితాలో స్థానం సంపాదించుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.. అంతేకాదు తమ నటనతో పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించి ఐఎండిబి 2025 టాప్ టెన్ నటీమణుల జాబితాలో చోటు దక్కించుకోవడం అనేది సౌత్ సినిమాకి గర్వకారణం అని చెప్పవచ్చు.
