Begin typing your search above and press return to search.

ఐమ్యాక్స్ వెర్ష‌న్‌ల‌లో ఇన్ని ర‌కాలా?

మ‌న‌కు పొరుగున ఉన్న బెంగ‌ళూరు, చెన్నైలో చెప్పుకోద‌గ్గ ఐమ్యాక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ లో ఎందుకు లేవు? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

By:  Sivaji Kontham   |   20 Dec 2025 12:11 AM IST
ఐమ్యాక్స్ వెర్ష‌న్‌ల‌లో ఇన్ని ర‌కాలా?
X

మ‌న‌కు పొరుగున ఉన్న బెంగ‌ళూరు, చెన్నైలో చెప్పుకోద‌గ్గ ఐమ్యాక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ లో ఎందుకు లేవు? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్ నుంచి ఐమ్యాక్స్ ను తొల‌గించిన త‌ర్వాత మ‌ళ్లీ ఎప్ప‌టికి వ‌స్తుంది? అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

అయితే హైద‌రాబాద్ సంగ‌తేమో కానీ, బెంగళూరులోని కోరమంగళలోని PVR నెక్సస్‌లో .. చెన్నైలోని నెక్సెస్ విజయ మాల్‌లోని పీవీఆర్‌- పలాజ్జోలో కొత్త ఐమ్యాక్స్ వెర్ష‌న్ల‌ను అప్ గ్రేడ్ చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. నిజానికి ఈ థియేట‌ర్ల‌ను నవంబర్‌లో పునరుద్ధరణ కోసం మూసేసారు. చివ‌రికి అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. నవంబర్ 20న ఐమ్యాక్స్ కార్పొరేషన్ - ఇండియా, ఎస్‌.ఇ ఆసియా, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతం డేనియల్ ఈ థియేట‌ర్లు లేజర్ అప్‌గ్రేడ్‌ల కోసం సిద్ధంగా ఉన్నాయని ధృవీకరించారు. IMAX అభిమానుల నుండి చాలా కాలంగా ఉన్న డిమాండ్ ని నెర‌వేరుస్తున్నామ‌ని, ప‌నులు చివరకు పూర్తయ్యాయ‌ని అన్నారు. అవ‌తార్ : ఫైర్ అండ్ యాష్ విడుదల నాటికి సినిమా థియేటర్లు ఆపరేషన్‌కు సిద్ధం చేస్తామ‌ని తెలిపారు. ఎట్ట‌కేల‌కుఅవ‌తార్ 3 చిత్రంతో పీవీఆర్‌- పలాజ్జో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అలాగే పీవీఆర్ నెక్సస్ కూడా బుకింగ్ వెబ్‌సైట్‌లలో కనిపించింది.

పీవీఆర్ ఐమ్యాక్స్ నెక్స‌స్ లో స్క్రీన్, సౌండ్ సిస్టమ్ తో పాటు సీట్లు అప్ గ్రేడ్ కాగా, PVR ఐమ్యాక్స్ ప‌లాజ్జాలో కొత్త స్క్రీన్, సౌండ్ సిస్టమ్ అప్‌గ్రేడ్ అయింది. పీవీఆర్‌ ఐమ్యాక్స్ నెక్స‌స్ కోర‌మంగ‌ళ , పీవీఆర్ ఐమ్యాక్స్ ప‌లాజ్జో రెండూ ఐమ్యాక్స్ డ్యూయ‌ల్ జెనాన్ 3డి ప్రొజెక్షన్ తో సిద్ధ‌మ‌య్యాయి. ఈ సినిమా థియేటర్లు ఇప్పుడు ఐమ్యాక్స్ XT లేజర్ 3Dకి అప్‌గ్రేడ్ అయ్యాయి. ఐమ్యాక్స్ ల కోసం ఒకానొక‌ సమయంలో జెనాన్ ఒక ప్రమాణంగా ఉండేది.. కానీ ఇప్పుడు XT లేజర్ మెరుగైన రంగులు, కాంట్రాస్ట్, రిజల్యూషన్‌తో షైనింగ్ తో షార్ప్ గా క‌నిపించే విజువ‌ల్‌ని అందిస్తుంది కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇచ్చార‌ని తెలిసింది. దీని కార‌ణంగా చెన్నై- బెంగళూరు నివాసితులు మొదటిసారి ఐమ్య‌క్స్ XT లేజర్ 3Dని ఆస్వాధిస్తారు. దక్షిణాది నగరాల్లోని అన్ని ఇతర ఐమ్యాక్స్ ప్రాపర్టీలు, ఐమ్యాక్స్ డ్యూయ‌ల్ జీనాన్ 3D ప్రొజెక్షన్‌ను మాత్ర‌మే కలిగి ఉన్నాయి.

కమర్షియల్ లేజర్ 3D ఐమ్యాక్స్ అనే అధునాతన ఫార్మాట్ కూడా ఉంది. ఇది తదుపరి తరం లేజర్ ప్రొజెక్షన్‌ను ఉపయోగించి లోతైన కాంట్రాస్ట్ - రిచ్ కలర్‌లతో షైనీ, షార్ప్ విజువ‌ల్ ఇమేజెస్ ని అందిస్తుంది. అయితే ఈ త‌ర‌హా 3Dకి పెద్ద ప్రయోజనం.. లేకపోతే ఇది మసకగా కనిపిస్తుంది. 3డిలో మరింత జీవం పోసే, లీనమయ్యేలా చేసే వీక్షణ అనుభవం క‌లుగుతుంది. భారతదేశంలో రెండు సినిమాహాళ్లకు మాత్రమే ఈ అధునాతన ప్రొజెక్షన్ ఉంది - ముంబైలోని పీవీఆర్‌ ఐమ్యాక్స్ లోయర్ పరేల్, ఢిల్లీలోని పీవీఆర్ సెలెక్ట్ సిటీ వాక్ సాకేత్ ల‌కు మాత్ర‌మే ఈ సాంకేతిక‌త అందుబాటులో ఉంది. చెన్నై , బెంగళూరు ఐమ్యాక్స్ స్క్రీన్‌లు కమర్షియల్ లేజర్ అప్‌గ్రేడ్ తో ఉన్నాయి. అయినా కానీ, XT లేజర్ కూడా మంచిది..అని టెక్ నిపుణులు విశ్లేషించారు.

భారతదేశంలోని 34 ఐమ్యాక్స్ సినిమాహాళ్లలో 13 ఇప్పటివరకు XT లేజర్ ప్రొజెక్షన్‌తో అమర్చారు. అప్‌గ్రేడ్‌తో, PVR ఐమ్యాక్స్ నెక్సస్ కోరమంగళ బెంగళూరు ... PVR ఐమ్యాక్స్ పలాజ్జో చెన్నై ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక స్క్రీన్ల‌ జాబితాలో చేరాయి. ఐమ్యాక్స్ సాంకేతిక‌త అంత‌కంత‌కు అప్ గ్రేడ్ అవుతోంది. మారుతున్న సాంకేతిక‌త‌కు త‌గ్గ‌ట్టు థియేట‌ర్ల‌ను కూడా అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ప్రేక్ష‌కుల‌కు మ‌రింత నాణ్య‌మైన క్వాలిటీతో సినిమాను అందించ‌డ‌మే సాంకేతిక‌త ల‌క్ష్యం.