'పౌజీ' భామ ఇంత సైలెంట్ అయితే ఎలా?
టాలీవుడ్ ఇప్పుడేం చిన్న పరిశ్రమ కూడా కాదు. పాన్ ఇండియాలోనే ఓ సంచలనం. దేశాలు, ఖండాలు దాటి వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించిన పరిశ్రమ.
By: Srikanth Kontham | 24 Oct 2025 3:00 PM ISTహీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఆ సినిమా రిలీజ్ కు ముందే ఆ నటి నెట్టింట ఎతంగా ఫేమస్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. నటిగా సక్సస్ అవుతుందా? లేదా? అన్నది తర్వాత సంగతి సోషల్ మీడియాలో మాత్రం సక్సెస్ అవ్వడం టార్గెట్ గా తమని తాము తెలివిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. హీరోయిన్ ఛాన్స్ అనే అవకాశాన్ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. స్థానికంగా ఫేమస్ అవుతున్నారు. టాలీవుడ్ ఇప్పుడేం చిన్న పరిశ్రమ కూడా కాదు. పాన్ ఇండియాలోనే ఓ సంచలనం. దేశాలు, ఖండాలు దాటి వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించిన పరిశ్రమ.
ప్రచారం ఛాన్స్ తీసుకోని నటి:
అలాంటి ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశం అంటే గ్రాండ్ గా భావించి తమని తాము తెలివిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. దీంతో తర్వాత చిత్రాల్లో అవకాశాలు ఈజీ అవుతున్నాయి. ప్లాప్ ల్లో ఉన్న భామలు కూడా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటున్నారు? అంటే కారణం పాపులారిటీ అన్నది ఎంతగా పనికొస్తుందన్నది అద్దం పడుతుంది. కానీ పాన్ ఇండియా సినిమా 'పౌజీ' లో ఛాన్స్ అందుకుని కూడా ఇమాన్వీ సైలెంట్ గా ఉంటం అన్నది ఆశ్చర్యంగా ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
మంచి డాన్సర్ అయినా స్లోగా:
ప్రభాస్ కి జోడీగా ఎంపిక చేసే విషయంలో దర్శకుడు హనురాఘవపూడి పెద్ద యుద్దమే చేసాడు. ఎంతో మంది హీరో యిన్లను..బాలీవుడ్ నటీమణుల్ని ఎంతో మంది పరిశీలించి..టెస్ట్ షూట్ నిర్వహించి ఫైనల్ గా ఇమాన్వీని ఎంపిక చేసాడు. అధికారికంగా విషయాన్ని వెల్లడించాడు. అందం..అభినయంతో ఇమాన్వికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. `పౌజీ` సెట్స్ కి వెళ్లిన కొన్ని నెలల అనంతరం ఇమాన్వీ ఓ డాన్స్ వీడియో కూడా షేర్ చేసింది. ఆ వీడియో తో తనలో డాన్సింగ్ స్కిల్స్ బయట పడ్డాయి.
విజయంతో అవకాశాలు వస్తాయనేనా?
ఆ తర్వాత మళ్లీ అమ్మడు మరో వీడియో గానీ..ఫోటోలు గానీ షేర్ చేయలేదు. అసలు నెట్టింట ఆమె గురించి చర్చ కూడా జరగలేదు. `పౌజీ` గురించి అప్ డేట్స్ కూడా ఏవీ లేకపోవడంతో ఇమాన్వీ గురించి కనీసం చర్చకు కూడా రాలేదు. ఇంత పెద్ద ప్రతిష్టాతక్మక చిత్రంలో ఛాన్స్ వచ్చిందంటే? ఏ నటి అయినా వ్యక్తిగతంగా తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో ఉంటుంది. కానీ అలాంటి ఛాన్స్ తీసుకోకుండా `పౌజీ` షూటింగ్ కే పరిమితమైంది. మరి సినిమా రిలీజ్..రిజల్ట్ తర్వాత అవకాశాలు తననే వెతుక్కుంటూ వస్తాయి? అన్న నమ్మకంతో కావొచ్చు.
