Begin typing your search above and press return to search.

ముచ్చటగా మూడోసారి.. మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్!

"ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు..ఆపై ఇక వద్దు" అనే నినాదం మన ఇండియాలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.

By:  Madhu Reddy   |   14 Oct 2025 1:47 PM IST
ముచ్చటగా మూడోసారి.. మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్!
X

"ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు..ఆపై ఇక వద్దు" అనే నినాదం మన ఇండియాలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ కొంతమంది కూతురు కావాలనో లేక కొడుకు కావాలనో.. ఇద్దరికి మించి పిల్లల్ని కంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ విషయం సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇలాగే పాటిస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్నాను అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆమె ఎవరో కాదు ప్రముఖ స్టార్ హీరోయిన్ ఇలియానా. 'దేవదాసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె ఆ తర్వాత వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ఇకపోతే సినిమాల కంటే కూడా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పులతోనే ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే మైఖేల్ డోలన్ తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఈమె.. ఇప్పుడు మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది.ఈ మేరకు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోవడానికి బేబీ బంప్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఇలియానా.

ఆ వీడియోలో తన బేబీ బంప్ తో ఊయల సర్దుతూ కనిపించి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. మరొకవైపు సంతోషకరమైన క్షణాన్ని ఆస్వాదించండి అంటూ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతున్నారు. ఇంకా ఇద్దరి పిల్లలలాగే మూడో బిడ్డకి కూడా జన్మనివ్వడానికి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఇలియానా ముచ్చటగా మూడోసారి ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలియానా వ్యక్తిగత జీవితం.. మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని 2023 మే 13న రహస్యంగా వివాహం చేసుకుంది. కానీ భర్త గురించి రివీల్ చేయలేదు. ఆగస్టు 2023లో మొదటి కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ జన్మించారు. ఇక ఆ సమయం లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయింది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. మరి కొంతమంది నీకు పుట్టిన కొడుకు తండ్రి ఎవరు అంటూ ఇలా చాలా రకాలుగా ప్రశ్నించారు. 2024 ఏప్రిల్ లో తన వివాహాన్ని అధికారికంగా ధ్రువీకరించింది.

2025 జూన్ లో తమ రెండవ కుమారుడు కీనూ రాఫే డోలన్ కి జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన ఇలియానా ఇప్పుడు మళ్లీ మూడవసారి త్వరలో తల్లి కాబోతున్నానని అభిమానులతో పంచుకుంది. మొత్తానికి అయితే ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతోంది ఇలియానా.