Begin typing your search above and press return to search.

రెండో బిడ్డ‌ను ప్ర‌స‌వించాక గంద‌ర‌గోళంలో ప‌డ్డాను: ఇలియానా

ఇలియానా డి క్ర‌జ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మ‌మ్మీ. తన భర్త మైఖేల్ డోలన్‌తో ఇటీవ‌ల‌ తన రెండవ బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన ఆనందాన్ని పంచుకుంది ఇలియానా.

By:  Sivaji Kontham   |   15 Sept 2025 9:22 AM IST
రెండో బిడ్డ‌ను ప్ర‌స‌వించాక గంద‌ర‌గోళంలో ప‌డ్డాను: ఇలియానా
X

ఇలియానా డి క్ర‌జ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మ‌మ్మీ. తన భర్త మైఖేల్ డోలన్‌తో ఇటీవ‌ల‌ తన రెండవ బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన ఆనందాన్ని పంచుకుంది ఇలియానా. రెండోసారి కూడా కొడుకు పుట్టాడు. కీను రాఫే డోలన్ అని పేరు పెట్టారు. ఇప్పటికే కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్‌కు మ‌మ్ అయింది. ఇప్పుడు 38 ఏళ్ల ఇలియానా తన ప్రసవానంతర పోరాటాల గురించి వెల్లడించింది. రెండవసారి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ప్పుడు తాను మాన‌సికంగా ఇబ్బందిప‌డ్డాన‌ని స్నేహితుల‌కు దూరంగా ఉండ‌టం వ‌ల్ల మ‌ద్ద‌తు లభించ‌లేద‌ని చెప్పింది.

మొద‌టి బిడ్డ‌ను క‌న్న‌ప్పుడు ప్ర‌తిదీ అంగీక‌రించ‌డానికి ప్ర‌య‌త్నించాను. ఒంటరి మహిళగా ఉండటం నుండి అకస్మాత్తుగా మారిన‌ట్టు అనిపించింది. ఆ త‌ర్వాత బిడ్డ ఆరోగ్యం ఆల‌నాపాల‌నపై దృష్టి పెట్టాను. కానీ రెండో బిడ్డ పుట్టేప్ప‌టికి మ‌న మాన‌సిక స్థితి మారిపోయింది. పూర్తిగా గందరగోళంలో ప‌డ్డాను. కాబట్టి ఇది చాలా కష్టంగా అనిపించింద‌ని ఇలియానా పేర్కొంది.

భారతదేశం నుండి బయటకు వెళ్లిన ఇలియానా తాను ముంబైని మిస్ అవుతున్నానని కూడా తెలిపింది. కానీ ముంబైలో తనకు తన స్నేహితురాళ్ల మద్దతు సాయం కూడా ఉంటుందని తెలిపింది. నేను అంద‌రినీ మిస్స‌వుతున్నాన‌ని కూడా ఆవేద‌న చెందింది. ఇలియానా - మైఖేల్ 2023లో వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు. భ‌ర్త‌తో పాటు ఇప్పుడు ఇలియానా విదేశాల‌లో నివ‌శిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. 2024లో విడుదలైన 'దో ఔర్ దో ప్యార్' చిత్రంలో ఇలియానా కనిపించింది. ఈ చిత్రంలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తి త‌దిత‌రులు న‌టించారు. ఆ త‌ర్వాత సినిమాల్లో న‌టించ‌డం లేదు. ఇలియానా తిరిగి కెరీర్ ప‌రంగా రీఎంట్రీ ఇవ్వాలంటే పిల్ల‌లు పెద్ద‌వాళ్ల‌వ్వాలి.